నాని.. 3 మూవీస్.. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్!
on Apr 11, 2021
నేచురల్ స్టార్ నాని చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. అవే.. 'టక్ జగదీష్', 'శ్యామ్ సింగ రాయ్', 'అంటే.. సుందరానికీ!'. చిత్రమేమిటంటే.. ఈ మూడు సినిమాలు కూడా ఒకే కామన్ ఫ్యాక్టర్ తో తెరకెక్కుతున్నాయి. అదేమిటంటే.. ఆయా చిత్రాలన్నీ సదరు దర్శకులకు థర్డ్ వెంచర్స్ కావడం.
ముందుగా.. విడుదలకు సిద్ధమైన 'టక్ జగదీష్' విషయానికి వస్తే శివ నిర్వాణకి ఇది మూడో సినిమా. నాని హీరోగా నటించిన 'నిన్ను కోరి' తనకు తొలి చిత్రం కాగా.. యువ సామ్రాట్ నాగచైతన్య నటించిన 'మజిలీ' రెండో ప్రయత్నం.
ఇక సెట్స్ పై ఉన్న 'శ్యామ్ సింగ రాయ్' సంగతి తీసుకుంటే.. రాహుల్ సాంకృత్యాన్కు ఇది మూడో ప్రయత్నం. అంతకుముందు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ 'ది ఎండ్', 'టాక్సీవాలా' తీశారు. వీటిలో యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'టాక్సీవాలా' హిట్ సినిమాల లిస్ట్ లో చేరింది.
అలాగే త్వరలో పట్టాలెక్కనున్న 'అంటే.. సుందరానికీ!' ముచ్చటే తీసుకుంటే.. వివేక్ ఆత్రేయకి అది తృతీయ ప్రయత్నం. శ్రీ విష్ణు హీరోగా 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరు రా' చిత్రాలను రూపొందించిన వివేక్.. 'బ్రోచేవారెవరు రా'తో మంచి సక్సెస్ ని చూశారు.
మొత్తంగా.. నాని తన కొత్త చిత్రాల విషయంలో ఒకే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారన్నమాట. మరి.. ఆయా దర్శకులకు ఈ మూడో ప్రయత్నాలు మంచి ఫలితాలను అందిస్తాయేమో చూడాలి.
Also Read