పవన్‌కు రాజకీయలొద్దని చెప్పిన అమితాబ్
on Sep 28, 2019
రాజకీయాల్లోకి వెళ్లినందుకు చింతిస్తున్నానని చిరంజీవి అన్నారు. అక్టోబర్ 2న 'సైరా నరసింహారెడ్డి' విడుదల సందర్భంగా ముంబైలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి దర్శకుడు, నటుడు, నిర్మాత ఫరాన్ అఖ్తర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మాట అన్నారు.
అసలు, రాజకీయాల ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే... "సార్.. నేను రాజకీయాల్లోకి వెళ్లాననుకుంటున్నానని చిరంజీవి నాతో అన్నారు. నేను వెళ్ళొద్దని చెప్పా. మీరు ఆ తప్పు చెయ్యొద్దని అన్నాను" అని అమితాబ్ బచ్చన్ అన్నారు. తాను చిరంజీవికి సలహాలు ఇస్తుంటాననీ, అయితే ఆయన వినడనీ బిగ్ బి అన్నారు. రజనీకాంత్‌కి కూడా రాజకీయాల్లోకి వెళ్ళొద్దని సలహా ఇచ్చాననీ, ఆయనా వినడం లేదని అమితాబ్ తెలిపారు. "ఇప్పుడు చిరంజీవి బ్రదర్ (పవన్ కల్యాణ్) రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకూ రాజకీయాలు వద్దని చెప్తున్నాను. కానీ, ప్రజలకు సేవ చేయాలనే తపన ఆయనలో ఉంది. హి ఈజ్ ప్యాషనేట్ అబౌట్ పాలిటిక్స్" అని అమితాబ్ చెప్పారు. చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని, స్నేహాన్ని ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
