రాధిక ఆప్టేకు వార్నింగ్ ఇచ్చారా..?
on Aug 21, 2016

ఎప్పుడూ ఏదో ఒక వీడియో లీక్ అయిందంటూ రాధిక ఆప్టే వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. గతంలో కూడా తన న్యూడ్ ఫొటోస్ లీక్ అయి పెద్ద దుమారమే రేపాయి. ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది. ఇటీవలే రాధిక ఆప్టే నటిస్తున్న ఒక సినిమాకు సంబంధించి ఫొటోలు, దానికి సంబంధించిన వీడియో ఒకటి లీకైంది. ఇంకేముంది ఎప్పటిలాగే సినిమాకు హైప్ తీసుకురావడానికే లీక్ చేశారంటూ వార్తలు. ఈ వార్తలకు స్పందించిన సినీ దర్శకనిర్మాతలు వీటితో తమకు ఏ సంబంధం లేదని, ఈ సినిమాను ఒక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించామని ఈ వీడియోలు అక్కడినుంచే లీక్ అయి ఉంటాయని ఏవో చెప్పుకొచ్చారు. అయితే ఈ వార్తలపై రాధిక ఆప్టే మాత్రం ఇంతవరకూ పెదవి విప్పలేదు. ఎందుకంటే ముందుగానే చిత్ర దర్శకనిర్మాతలు రాధికకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారంట. వీడియో లీక్ అయిన వెంటనే మీడియా ముందుకు రావొద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ప్రకటన చేయొద్దని చెప్పారంట. అంతేకాదు కొంత పరిహారం సైతం చెల్లించి ఆమె నోరు మూయించారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో వారికే తెలియాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



