రామ్ సినిమా కోసం బన్నీ వెయిటింగ్.. ఎందుకో తెలుసా?
on Sep 18, 2023

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సినిమా కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎదురు చూస్తున్నాడు. హీరో సినిమా కోసం అభిమానులు ఎదురుచూడటం సహజం.. కానీ ఒక హీరో సినిమా కోసం మరో హీరో ఎదురు చూడటం ఏంటి అనుకుంటున్నారా. దానికి కారణం ఆ సినిమాకి దర్శకుడు బోయపాటి శ్రీను కావడమే.
'పుష్ప'తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న బన్నీ, ప్రస్తుతం 'పుష్ప-2' తో బిజీగా ఉన్నాడు. అలాగే డైరక్టర్స్ త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు కమిటై ఉన్నాడు. వీటితోపాటు అట్లీ, బోయపాటి ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి. అయితే బోయపాటి ప్రాజెక్ట్ విషయంలో బన్నీ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట. నిజానికి వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా 'సరైనోడు' మంచి విజయం సాధించింది. ఇప్పుడు వీరి కాంబోలో రెండో సినిమా అంటే ఖచ్చితంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. కానీ బన్నీ మాత్రం ప్రస్తుతం తనకున్న పాన్ ఇండియా ఇమేజ్ దృష్ట్యా ఆలోచనలో పడ్డాడట.
మాస్ డైరెక్టర్ గా బోయపాటికి తెలుగునాట మంచి గుర్తింపు ఉంది. అయితే ఆయన ఊర మాస్.. పాన్ ఇండియా ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతుంది అనేది తెలీదు. ఆయన డైరెక్ట్ చేసిన పలు సినిమాలు హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్ లో మంచి వ్యూస్ సాధించాయి. కానీ ఆ వ్యూస్ వసూళ్లగా మారతాయా అంటే చెప్పలేము. వీటికి సమాధానం కావాలంటే, సెప్టెంబర్ 28న విడుదల కానున్న, రామ్ తో బోయపాటి చేసిన తన తొలి పాన్ ఇండియా మూవీ 'స్కంద' కోసం ఎదురు చూడాలి. ఆ సినిమాతో బోయపాటి మాస్ పాన్ ఇండియా ప్రేక్షకులకు ఎక్కుతుందో లేదో క్లారిటీ వస్తుంది. దానిని బట్టి బోయపాటి సినిమాపై నిర్ణయం తీసుకోవాలని బన్నీ చూస్తున్నాడట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



