'భగవంత్ కేసరి' వాయిదా.. ఫుల్ క్లారిటీ వచ్చేసింది!
on Sep 18, 2023

నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్, శ్రీలీల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బాలకృష్ణ షూటింగ్ లో పాల్గొనలేరని, దాంతో ఈ సినిమా వాయిదా పడుతుందని ప్రచారం జరిగింది. అయితే వాయిదా పడుతుందన్న వార్తల్లో వాస్తవం లేదని తాజాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ 'భగవంత్ కేసరి' నుంచి తాజాగా కొత్త పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఆ పోస్టర్ లో అక్టోబర్ 19నే సినిమాని విడుదల చేయనున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. ఇక షూటింగ్ విషయానికొస్తే.. చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మినహా మొత్తం సినిమా షూటింగ్ పూర్తయిందట. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చిత్రీకరణ కూడా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోందట. ఈ వారంలోనే మొత్తం షూటింగ్ పూర్తి చేసి గుమ్మడి కాయ కొట్టనున్నారని సమాచారం. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయట. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆర్ఆర్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 12 నాటికి అన్ని పనులు పూర్తి చేసుకొని, ముందుగా ప్రకటించినట్లుగానే అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదలవ్వడం ఖాయమని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



