బాలీవుడ్ స్టార్స్ అంతా ఒకవైపు.. ఎన్టీఆర్ ఒక్కడే ఒకవైపు!
on Sep 17, 2023

బాలీవుడ్ స్టార్స్ ని జూనియర్ ఎన్టీఆర్ ఢీ కొట్టబోతున్నాడా? సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్ అంతా ఒకవైపు, ఎన్టీఆర్ ఒక్కడు ఒకవైపు అన్నట్టుగా పోరు జరగనుందా? అంటే అవుననే అనిపిస్తోంది. అయితే బాలీవుడ్ స్టార్స్ తో ఎన్టీఆర్ వార్.. రియల్ లైఫ్ లో కాదు, రీల్ లైఫ్ లో ఉండబోతుంది.
ప్రతిష్టాత్మక యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో నటించే అవకాశాన్ని దక్కించుకున్న మొదటి సౌత్ స్టార్ ఎన్టీఆర్ అనే విషయం తెలిసిందే. అధికారిక ప్రకటన రానప్పటికీ 'వార్-2'తో ఎన్టీఆర్ స్పై యూనివర్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అలాగే ఇందులో ఎన్టీఆర్ నెగటివ్ రోల్ లో కనిపించనున్నాడని అంటున్నారు. అయితే 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. ఇలా ఓ బాలీవుడ్ ఫిల్మ్ లో నెగటివ్ రోల్ చేయడమేంటని పెదవి విరిచినవారు కూడా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి బలమైన కారణం ఉందంటున్నారు. అదేంటంటే కేవలం 'వార్-2'కి మాత్రమే కాదు, మొత్తం స్పై యూనివర్స్ కే మెయిన్ విలన్ ఎన్టీఆర్ అని తెలుస్తోంది. ఆ రోల్ అంత పవర్ ఫుల్, అంత ప్రాముఖ్యత ఉన్నది కాబట్టే నిర్మాత ఆదిత్య చోప్రా పట్టుబట్టి మరీ ఎన్టీఆర్ ని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.
ముందు నుంచి అనుకుంటున్నట్టుగా స్పై యూనివర్స్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ 'వార్-2'తో కాదని, ఈ ఏడాది నవంబర్ లో రానున్న 'టైగర్-3'తోనే ఉంటుందని టాక్. 'టైగర్-3' క్లైమాక్స్ లో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని, అందులో జస్ట్ శాంపిల్ విలనిజం చూపించి.. అసలుసిసలైన విలనిజం 'వార్-2'లో చూపిస్తాడని అంటున్నారు. అంతేకాదు 'వార్-2' తర్వాత రానున్న 'టైగర్ వర్సెస్ పఠాన్'లో కూడా ఎన్టీఆరే విలన్ అట. ఇలా 'వార్-2'లో హృతిక్ రోషన్ ని ఢీ కొట్టి, 'టైగర్ వర్సెస్ పఠాన్'లో సల్మాన్ ఖాన్ ని, షారుఖ్ ఖాన్ ని ఢీ కొట్టి.. బాలీవుడ్ స్టార్స్ పాలిట విలన్ గా మారబోతున్నాడు ఎన్టీఆర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



