బన్నీ వేరు కుంపటి పెట్టేసుకుంటున్నాడా..?
on May 10, 2016

అల్లు అర్జున్ అంటే మెగా హీరో అని అన్న తర్వాతే అల్లు రామలింగయ్య మనవడని, అల్లు అరవింద్ తనయుడని మాట్లాడుకుంటారు. ఇన్నాళ్లూ ఇలాగే కంటిన్యూ అయినప్పటికీ, ఇప్పుడు మాత్రం, బన్నీ తనకంటూ సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే పనిలో పడ్డాడట. ఎలాగూ స్టార్ డమ్ ఉంది కాబట్టి, తనకంటూ ఒక లెగసీని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడట. ఇప్పటికే మెగాభిమానులు మొత్తం పవర్ స్టార్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ గా రెండు వర్గాలుగా విడిపోయారు. తాజాగా అల్లు ఫ్యాన్స్ పేరుతో మరొక సారి చీలిక వచ్చే అవకాశం ఉందని సినీజనాలంటున్నారు. పవన్ ఫ్యాన్స్ అయితే బన్నీని ద్వేషిస్తున్నారు కూడా.
ఒకప్పుడు పవర్ స్టార్ ను పొగిడిన బన్నీ, ఇప్పుడు కనీసం స్టేజ్ మీద ఆయన గురించి చెప్పమన్నా చెప్పను బ్రదర్ అంటున్నాడు అంటూ పవన్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చిరంజీవి అంటే విపరీతమైన అభిమానాన్ని పబ్లిగ్గానే ప్రకటించే బన్నీ, పవన్ గురించి మాత్రం వేడుకల్లో పెద్దగా మాట్లాడడు. ఇదే పవన్ ఫ్యాన్స్ కు బన్నీ అంటే అయిష్టాన్ని పెంచింది. బన్నీ మెగాబేస్ మీదే వచ్చాడు కానీ కష్టపడి తనకంటూ స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు. అందుకే ఇప్పుడు వేరుకుంపటి పెట్టుకుని తనకంటూ ఒక బేస్ ను తయారుచేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పటికే అఖిల భారత అల్లు సంఘం పేరుతో ఒక అభిమాన సంఘం ఏర్పడిందని, దానికి బన్నీ, అల్లు శీరీష్ సపోర్ట్ కూడా ఫుల్లుగా ఉందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. మెగా హీరోగా తనకున్న ట్యాగ్ ను మెల్లగా క్లియర్ చేసుకుని, ఇండిపెండెంట్ గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న బన్నీ ప్రయత్నం ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలి..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



