గబ్బర్ సింగ్ జంట మళ్లీ రిపీట్ అవుతారా..?
on May 10, 2016

పవన్ ప్రస్తుతం వేకేషన్లో ఉన్నాడు. తన భార్య స్వస్థలమైన రష్యాకు వెళ్లాడని అందరూ అంటున్నా, నిజానికి ఎక్కడకు వెళ్లాడన్నది ఎవరికీ అంతుచిక్కని విషయం. వెనక్కి రాగానే వరస తిరిగి సినిమాల్లో బిజీ అయిపోతాడు పవన్. ఎస్.జే.సూర్య సినిమాయే వాటిలో మొదటిది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నదానిపై చాలా చర్చ జరిగింది. చివరకు మళయాళ భామ పార్వతిని హీరోయిన్ గా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని అమ్మాయిని హీరోయిన్ గా పెట్టడం వలన, పబ్లిసిటీ బర్డెన్ ఎక్కువ అవుతుందని మూవీ టీం ఫీలవుతున్నారట. మన తెలుగు జనాలకు కాస్త తెలిసిన ముఖమైతే బెస్ట్ అని వారి అభిప్రాయం. ఇదే విషయాన్ని పవన్ కు చెబితే, నిర్ణయాన్ని దర్శకుడు సూర్య, నిర్మాత శరత్ మరార్ కే వదిలేశాడట. దీంతో ఇప్పుడు మూవీకి హీరోయిన్ ను వెతికే పనిలో బిజీగా ఉంది మూవీ టీం.
గబ్బర్ సింగ్ తో పవన్ కు బాగా కలిసొచ్చిన శృతి హాసన్ అయితే, సినిమాలో హీరోయిన్ గా చాలా బాగుంటుందని డైరెక్టర్ సూర్య ఫీలవుతున్నాడట. దీనికి పవన్ కూడా అడ్డు చెప్పకపోవడంతో, ఎక్కువ శాతం శృతి హాసన్ కే పవన్ సినిమా లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. పైగా డౌన్ లో ఉన్నప్పుడు తన కెరీర్ కు అద్భుతమైన పుష్ ఇచ్చిన సినిమా గబ్బర్ సింగ్ అంటే పవన్ కు సెంటిమెంట్. అందుకే పవన్ కూడా ఆ సినిమాకు వర్క్ చేసిన వాళ్లందరినీ సెంటిమెంట్ గా ఫీల్ అవుతాడు. దీంతో ఇప్పుడు గబ్బర్ సింగ్ జంట మళ్లీ తెరపై కలిసి కనబడతారనే మాట సినీవర్గాల్లో వినిపిస్తోంది. సర్దార్ తో ఫ్లాప్ ను ఖాతాలో వేసుకున్న పవన్ కు శృతిహాసన్ కలిసొచ్చి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



