వేణుమాధవ్ చనిపోయాడని ప్రచారం..కేసు పెట్టాడు..!
on May 10, 2016

మనిషి చనిపోయాడని చెప్పేముందు వార్తా సంస్థలు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం ఎంత అవసరమో మరోసారి నిరూపితమైంది. ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ గత కొంత కాలంగా సినిమాల్లో కనిపించడం లేదన్న సంగతి తెలిసిందే. దాంతో ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారని వార్తలు వచ్చాయి. రీసెంట్ గా కొన్ని న్యూస్ ఛానెల్స్, వెబ్ సైట్స్ వేణుమాధవ్ చనిపోయారని ప్రచారం చేశాయి. ఈ విషయం తెలిసి మనస్థాపానికి గురయ్యారు వేణు మాధవ్. కనీసం నిజానిజాలు ఎంక్వైరీ చేయకుండా, ఫేక్ న్యూస్ ను ఎలా ప్రచారం చేస్తారంటూ ఆయన మనోవేదనతో పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు.
తనపై కావాలనే ఎవరో కుట్రపూరితంగా ఇలాంటి ప్రచారాలను చేస్తున్నారని, ఇది తనను తీవ్రంగా బాధపెట్టిందని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. వేణుమాధవ్ గురించిన న్యూస్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా కూడా ఫాస్ట్ గా వ్యాపించింది. ఎవరో ఒకరు పెట్టే తప్పుడు పోస్ట్ లు వలన, ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రీసెంట్ గా తమిళ కమెడియన్ సెంథిల్, గతంలో హాలీవుడ్ సెలబ్రిటీ జాకీచాన్, రాక్ డ్వేన్ జాన్సన్ లాంటి వారందరి మీదా ఇలాంటి రూమర్లే వచ్చాయి. న్యూస్ ను స్ప్రెడ చేసేముందు, నిజానిజాలు తెలుసుకోవడమే దీనికి పరిష్కారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



