బన్నీ బోయపాటికి తప్పిన ప్రమాదం..!
on May 27, 2016

స్టైలిష్ స్టార్ నటించిన సరైనోడు సూపర్ హిట్టైంది. ఈ రోజే మళయాళంలో కూడా యోధావుగా రిలీజైంది. సినిమా సూపర్ హిట్టవ్వాలని బన్నీ, దర్శకుడు బోయపాటి శ్రీను కలిసి సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం స్వామిని దర్శించుకున్న తర్వాత తమకు కేటాయించిన గదికి చేరుకున్నారు హీరో దర్శకుడు. అయితే గది నుంచి బయటికి లిఫ్ట్ లో వస్తున్న సమయంలో లిప్ట్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అక్కడి అధికారులు కంగారు పడి ఎలాగోలా తలుపులు పగలకొట్టి, ఇద్దర్నీ బయటకు తీసుకొచ్చారు. అయితే లిఫ్ట్ లో చిన్న సమస్య వచ్చిన కారణంగా ఈ పొరపాటు జరిగిందని, ఇద్దరికీ ఏమీ కాకుండా సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఆపద తప్పడంతో, అల్లు అర్జున్ బోయపాటి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



