మళయాళంపై సరైనోడి దాడి ఈరోజే...!
on May 27, 2016

డివైడ్ టాక్ తో మొదలై సూపర్ హిట్ గా నిలిచింది అల్లు అర్జున్ సరైనోడు. వంద కోట్ల గ్రాస్, 70 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి బన్నీ కెరీర్ బెస్ట్ లో నిలిచింది. ఇక్కడి రికార్డ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో, మళయాళంపై దాడికి సిద్ధమవుతున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ కు తెలుగుతో పాటు సమానమైన మార్కెట్ మళయాళంలో ఉంది. అక్కడి స్టార్ హీరోలతో పాటు, అల్లు అర్జున్ సినిమాలను కూడా ఆదరిస్తుంటారు కేరళ అభిమానులు. మన దగ్గర యావరేజ్ గా ఆడిన ఇద్దరమ్మాయిలతో సినిమా కూడా మళయాళంలో భారీ హిట్. అందుకు పూర్తి నమ్మకంతో కేరళ బరిలోకి దిగుతున్నాడు సరైనోడు. యోధావు పేరుతో కేరళ రాష్ట్రవ్యాప్తంగా 80 స్క్రీన్లలో బన్నీ సినిమా రిలీజవుతోంది. ది వారియర్ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే మూవీ రిలీజ్ ను పురస్కరించుకుని కేరళలో చాలా చోట్ల బన్నీ కటౌట్లు, పోస్టర్లతో నింపేశారు. కేరళలో బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని భావిస్తున్నారు అక్కడి జనాలు. అక్కడ ఫస్ట్ డే తోనే సినిమా పాజిటివ్ రివ్యూలు, మంచి ఓపెనింగ్స్ రాబడుతుండటం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



