గోపీచంద్ 'సీటీమార్' రిలీజ్ డేట్ వచ్చేసింది
on Jan 28, 2021

ఈరోజు రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ స్పెషల్‌గా కనిపిస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ 'పుష్ప', వరుణ్ తేజ్ 'గని' విడుదల తేదీలు వెల్లడి కాగా, లేటెస్ట్‌గా గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరెక్ట్ చేస్తోన్న 'సీటీమార్' మూవీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ ఏప్రిల్ 2న విడుదల కానున్నది. తమన్నా హీరోయిన్ కాగా, దిగంగన సూర్యవంశీ సెకండ్ హీరోయిన్. భూమిక చావ్లా, రెహమాన్ కీలక పాత్రలు చేస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
గోపీచంద్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రిలీజ్ డేట్ పోస్టర్‌ను షేర్ చేశాడు. ఇందులో భారీ వాహనానికి చెందిన టైర్ల మీద 'థోర్' సినిమాలో హీరో ఉపయోగించే భారీ హ్యామర్ లాంటి హ్యామర్‌ను పట్టుకొని తీక్షణంగా చూస్తున్నాడు గోపీ. అక్కడి వాతావరణం ఓ మెకానిక్ షెడ్‌లా కనిపిస్తోంది. ఒక యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన స్టిల్‌గా దాన్ని ఊహించవచ్చు. ఆ పోస్టర్‌కు, "#Seetimaar is coming to you on April 2nd!!" అనే క్యాప్షన్ జోడించాడు గోపీ.
మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా, సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు. 'గౌతమ్ నందా' మూవీ తర్వాత గోపీచంద్, సంపత్ నంది కాబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. ఆ ఇద్దరికీ ఈ సినిమా ఓ లిట్మస్ టెస్ట్ కానున్నది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



