అల్లరి నరేశ్ ఉగ్రావతారం!
on Aug 22, 2022

అల్లరి నరేశ్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన 'నాంది' సినిమా మంచి విజయం సాధించింది. నటునిగా నరేశ్‌లోని మరో కోణాన్ని ఆ చిత్రం ఆవిష్కరించింది. కేవలం కామెడీ హీరో క్యారెక్టర్లకే తాను పరిమితం కాదనీ, సీరియస్ క్యారెక్టర్స్‌ను కూడా తాను సునాయాసంగా చేస్తానని ఆ సినిమాతో ప్రూవ్ చేశాడు నరేశ్. ఇప్పుడు అదే కాంబినేషన్‌తో మరో సినిమా రూపొందుతోంది. ఆ చిత్రానికి 'ఉగ్రం' అనే టైటిల్ ఖరారు చేశారు.
సోమవారం రిలీజ్ చేసిన టైటిల్ లోగో పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ పోస్టర్‌లో ఒళ్లంతా రక్తం ఓడుతున్న నరేశ్ పెద్దగా కేకవేస్తూ కనిపిస్తున్నాడు. అతని వీపుపై ఎవరో కత్తితో పొడిచినట్లుగా ఉంది. ఈ పోస్టర్ రిలీజ్ చేయడం ఆలస్యం, ట్విట్టర్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండింగ్‌లోకి వెళ్లింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్న 'ఉగ్రం' చిత్రానికి సిద్ సినిమాటోగ్రాఫర్‌గా, చోటా కె. ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



