పూజా కార్యక్రమాలతో మొదలైన 'పుష్ప 2'
on Aug 22, 2022

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' మూవీ 2021లో విడుదలై ఆ ఇద్దరి కెరీర్‌లలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు దాని సీక్వెల్ 'పుష్ప 2: ద రూల్' వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో జరిగాయి. ఇండియా డే పెరేడ్‌లో పాల్గొనడానికి న్యూయార్క్‌కు వెళ్లినందున అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అలాగే హీరోయిన్ రష్మిక కూడా ముంబైలో ఉన్నందున రాలేదు.
ఈ మూవీ లాంచ్ ఈవెంట్‌కు డైరెక్టర్ సుకుమార్, ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ హాజరై పూజ నిర్వహించారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్, శ్రీవల్లిగా రష్మికా మందన్న నటిస్తోన్న ఈ మూవీలో ఫహద్ ఫాజిల్, ప్రియమణి, సునీల్, అనసూయ, జగదీశ్ ప్రధాన పాత్రధారులు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాణమవుతోన్న ఈ చిత్రానికి దేవి శ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, మిలొస్లావ్ క్యూబా బ్రోజెక్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు.
'పుష్ప: ద రైజ్' క్లైమాక్స్‌లో సూచించిన విధంగా 'పుష్ప 2: ద రూల్'లో కథ ప్రధానంగా అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ మధ్య ఘర్షణ నేపథ్యంలో కొనసాగనున్నది. ఆ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



