హిట్ కోసం అక్కినేని వారసుడి కష్టాలు...
on Jul 30, 2018

అక్కినేని కుటుంబం తెలుగు చిత్ర సీమ మూల స్థంబాలుగా చెప్పుకునే కుటుంబాల్లో ఒకటి.ఇంత పెద్ద సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా ఓ అక్కినేని వారసుడు మాత్రం ఓ హిట్ కోసం ప్రాకులాడుతున్నాడు.ఎంత కుటుంబ అభిమానులున్నాఅన్ని సినిమాలకు ఆదరణ లభించటం కష్టమే.ఇదే హీరో సుశాంత్ పరిస్థితి.దాదాపు పదేళ్లవుతోంది సినీ రంగప్రవేశం చేసి ఇప్పటివరకూ సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు.‘కాళిదాసు’ మూవీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్.. మొన్నటి ‘ఆటాడుకుందాం రా’ వరకూ ఎన్నో సినిమాలు చేసినా ఏ ఒక్కటి కలిసిరాలేదు. కెరీర్ లో హిట్టు కోసం ఎంతో కష్టపడుతున్న సమయంలో తన తండ్రి చనిపోవడం వేదన మిగిల్చిందని సుశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు.
తన కెరీర్ గురించి తండ్రి ఎంతో కంగారు పడేవాడని.. అయితే నాన్న చనిపోయేముందు ఆయనకు ‘చి.ల.సౌ’ కథ వినిపించానని.. ఈ సినిమాతో ఖచ్చితంగా నిలదొక్కుకుంటానని చెప్పారని సుశాంత్ తెలిపాడు.రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘చి.ల.సౌ’ తెరకెక్కనుంది.సినిమా ఫ్లాప్ అయినప్పుడు చాలా మంది అనేక రకాలుగా విమర్శిస్తారని సుశాంత్ ఆవేదన వ్యక్తం చేసాడు.ఆ విమర్శలను బట్టి తాను లోపాలు సరిదిద్ధుకుంటానని తెలిపాడు.ఫ్లాపుల తాలూకు బాధను మరిచిపోవడానికి స్నేహితుల్ని కలుస్తానని,కుంటుంబంతో సరదాగా గడుపుతానని వివరించారు.అఖిల్ - చైతన్యలతో బాధను పంచుకుంటానని తెలిపాడు.చూద్దాం మరి ఈ సారైనా సుశాంత్ హిట్ కొడతాడో?లేదో?..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



