బిగ్ బాస్ పై కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్
on Jul 30, 2018
బుల్లితెరపై సంచనాలు సృష్టిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్.గత సంవత్సరం ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహిరించిన ఈ షోకి ప్రస్తుతం నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు అనే కాప్షన్ తో వచ్చిన ఈ షో దానికి తగ్గట్లే గత షో కి భిన్నంగా తీసుకున్న నిర్ణయమే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని తిరిగి వోటింగ్ ద్వారా హౌస్ లోకి పంపటం.శ్యామల,నూతన్ నాయుడు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు,ఈ వోటింగ్ లో 11.79కోట్ల చిల్లర ఓట్లు తమకు వచ్చినట్లుగా నాని ప్రకటించారు.ఇందులో కొత్త ఏముంది అని అంతా అనుకుంటారు కానీ ఆసక్తికర విషయం ఏమిటంటే నూతన్ ఎంట్రీ కోసం కౌశల్ ఆర్మీ భారీగా ఓట్స్ వేసినట్లు తెలుస్తోంది.రెండు వారాలు హౌస్ లో ఉండి ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడు,కౌశల్ మధ్య మంచి స్నేహబంధం ఉంది.ఈ నేపధ్యం లో నే ఆయనికి ఇంత భారీ వోటింగ్ పడినట్లు సమాచారం.అయితే బిగ్ బాస్ లో ఉన్నది సెలెబ్రెటీస్ కాబట్టి వారి ఫాన్స్ ఓట్స్ వేయటం సర్వసాధారణం కానీ అనూహ్యంగా కౌశల్ విషయంలో తన ఫాన్స్ ఇంతగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారో తెలియని పరిస్థితి.అలానే కౌశల్ గురించి సోషల్ మీడియాలో పాజిటివ్ గా పోస్టులు పెడుతూ షో మీద,కౌశల్ మీద ఆసక్తి పెంచుతున్నారు.కౌశల్ ఆర్మీ మూలంగా షో చూసేవాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇదిలా ఉంటే గత వారం నాని బాబు గోగినేనిని,కౌశల్ ని మందలించిన సంగతి తెలిసిందే.అయితే కౌశల్ ను నాని తిట్టాడని సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ తదితర ఫ్యాన్స్ గ్రూపులు రెచ్చిపోతున్నాయి. #NaniUnifitorBB2host పేరుతో ట్రోలింగ్ మొదలు పెడుతున్నారు. ఎన్టీఆర్ తో పోలిస్తే నాని పర్ఫామెన్స్ బాగా లేదంటూ ప్రచారం చేస్తున్నారు.ఈ హడావిడి చూస్తుంటే ఇదంతా కౌశల్ ప్రీ ప్లాన్డ్ గేమ్ ప్లాన్ అని అంతా చర్చించుకుంటున్నారు.అందులోను ఇప్పటికే పలుమార్లు నేను గేమ్ ఆడటానికే వచ్చా అని కౌశల్ అనటం కూడా చర్చనీయాంశంగా మారింది.