అఖిల్ ఐడియా అదిరిందిగా...
on Aug 20, 2016

తన రెండో సినిమా ఎవరితో చేయాలి... దాన్ని ఎప్పుడు పట్టాలెక్కించాలి? అనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాడు అఖిల్. ఫస్ట్ సినిమా ఫ్లాప్ అవ్వడం అఖిల్ నాలుగు అడుగులు వెనక్కి వేయాల్సివస్తోంది. రెండో సినిమా విషయంలో తప్పు చేస్తే.. ఇక పూర్తిగా వెనకే ఉండాల్సి వస్తుంది. అందుకే... ఆచి తూచి అడుగులేయాల్సివస్తోంది. అయితే కాస్త లేటయినా ఓ మంచి సినిమా చేయాలన్నది అఖిల్ ప్రయత్నంగా తోస్తోంది. ఈసారి తమిళంలోనూ అడుగుపెట్టాలని చూస్తున్నాడట. అందుకే ఓ మల్టీస్టారర్‌కి ప్లాన్ వేశాడని సమాచారం. తమిళ హీరో కార్తితో కలసి అఖిల్ నటించే ఛాన్స్ ఉందని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. నాగార్జున కార్తి కలసి ఊపిరి సినిమా చేశారు. అప్పుడు అఖిల్ - కార్తి ల సినిమా ప్రస్తావన కూడా వచ్చిందని తెలుస్తోంది. మరి ఇప్పుడు అఖిల్‌తో సినిమా చేయడానికి కార్తి దగ్గర కాల్షీట్లు అందుబాటులో ఉన్నాయా, లేదా అనేది అనుమానంగా మారింది. ఎందుకంటే కార్తి వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఇప్పటికిప్పుడు డేట్లు ఇవ్వమంటే కష్టమే. అఖిల్‌మల్టీస్టారర్ అనేది ఇప్పుడు కార్తి చేతుల్లో ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



