Home

»

Latest News

నా ప్రాణం కన్నా ఎన్టీఆరే ఎక్కువ..

Aug 20, 2016 11:52AM

జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్‌ల ఫ్రెండ్‌షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రాణస్నేహితులుగా చెప్పే వారిలో ఖచ్చితంగా ముందువరుసలో ఉండే జంట వీరిది. యాదృచ్ఛికంగా ఇద్దరూ ఒకే రోజు పుట్టడం, దానికి తోడు చిన్నప్పటి నుంచి కలిసి పెరగడంతో ఇద్దరు ప్రాణస్నేహితులుగా మారారు. ఏళ్లు గడుస్తున్నకొద్ది ఆ బంధం ఇంకా బలపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌పై తనకున్న ప్రేమను మరోసారి చాటిచెప్పాడు మనోజ్. అన్నా మీకు ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టం అని ట్విట్టర్ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు నా ప్రాణం లెక్కచేయనంత అని ట్వీట్ చేశాడు మనోజ్. ఇంకేముంది ఈ ట్వీట్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు మనోజ్‌కు థాంక్స్ చెబుతూ నువ్వు సూపర్ అన్నా అంటూ కామెంట్స్ చేశారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com