వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ బాటలో అఖిల్!
on Jul 12, 2022

అక్కినేని బుల్లోడు అఖిల్ త్వరలో `ఏజెంట్`గా పలకరించబోతున్నాడు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ లో.. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా ఎంటర్టైన్ చేయనున్న ఈ భారీ బడ్జెడ్ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఇదిలా ఉంటే, `ఎంసీఏ`, `వకీల్ సాబ్` చిత్రాల దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో అఖిల్ ఓ సినిమా చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. అక్కా తమ్ముడు కథతో రూపొందనుందని సమాచారం. అంతేకాదు.. ఈ చిత్రానికి 1999 నాటి పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ `తమ్ముడు` టైటిల్ ని రిపీట్ చేయబోతున్నారని బజ్. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మరి.. పవన్ దర్శకుడితో, పవన్ టైటిల్ తో అఖిల్ చేయబోతున్న ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో చూడాలి.
కాగా, ఇప్పటికే పవన్ `తొలిప్రేమ` టైటిల్ తో వరుణ్ తేజ్ ఓ సినిమా చేయగా.. `ఖుషి` టైటిల్ తో విజయ్ దేవరకొండ మరో మూవీ చేస్తున్నారు. ఇప్పుడు అఖిల్ కూడా ఈ జాబితాలో చేరనుండడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



