నాలుగేళ్ళ `ఆర్ ఎక్స్ 100`!
on Jul 12, 2022

యువతరాన్ని విశేషంగా అలరించిన ఈతరం ప్రేమకథా చిత్రాల్లో `ఆర్ ఎక్స్ 100`కి ప్రత్యేక స్థానం ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై కాసుల వర్షం కురిపించిన ఈ రొమాంటిక్ డ్రామాని దర్శకుడు అజయ్ భూపతి ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. పాయల్ రాజ్ పుత్ గ్లామర్, పాటలు మెయిన్ ఎస్సెట్ గా నిలిచిన ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ తో యువ కథానాయకుడు కార్తికేయకి ఫస్ట్ సక్సెస్ దక్కింది.
కథాంశం విషయానికి వస్తే.. తన శారీరక వాంఛలు తీర్చుకోవడానికి ఇందు (పాయల్) అనే ఓ యువతి.. ప్రేమ పేరుతో శివ (కార్తికేయ) అనే యువకుడిని ఎలా మోసం చేసింది? చివరకి వీరి కథ ఎలాంటి తీరాలకు చేరింది? అనేదే `ఆర్ ఎక్స్ 100` సినిమా.
ఛైతన్ భరద్వాజ్ స్వరపరిచిన పాటల్లో ``పిల్లా రా`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``మనసును పట్టి``, `రెప్పలనిండా``, ``అదిరే హృదయం``, ``రుధిరం మరిగి``, ``నిప్పై రగిలే`` గీతాలు కూడా రంజింపజేశాయి. హిందీలో `తడప్` పేరుతోనూ, ఒడియాలో `ప్రేమో న పాగలోపన` టైటిల్ తోనూ ఈ సినిమా రీమేక్ అయింది. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన `ఆర్ ఎక్స్ 100`.. 2018 జూలై 12న జనం ముందుకు వచ్చింది. కాగా, నేటితో ఈ సెన్సేషనల్ హిట్ నాలుగు వసంతాలను పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



