`ది వారియర్`తో ఆ నలుగురు మళ్ళీ ట్రాక్ లోకి వస్తారా!
on Jul 12, 2022

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన కాప్ డ్రామా `ది వారియర్`. కోలీవుడ్ కెప్టెన్ లింగుస్వామి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కృతి శెట్టి కథానాయికగా నటించగా.. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా సందడి చేయనున్నారు. నదియా, భారతీరాజా, అక్షర గౌడ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించిన ఈ చిత్రం.. జూలై 14న తెరపైకి రాబోతోంది.
కాగా, ఈ సినిమా విజయం నలుగురు ప్రముఖులకి కీలకంగా మారింది. ఇంతకీ ఆ నలుగురు ఎవరంటే.. లింగుస్వామి, ఆది పినిశెట్టి, నదియా, దేవి శ్రీ ప్రసాద్. దర్శకుడు లింగుస్వామికి సాలిడ్ హిట్ దక్కి పదేళ్ళు దాటగా.. `రంగస్థలం` అనంతరం ఆది పినిశెట్టి నటించిన సినిమాలేవీ కమర్షియల్ గా రాణించలేకపోయాయి. ఇక నదియా విషయానికి వస్తే.. ఈ క్యాలెండర్ ఇయర్ లో రిలీజైన `గని`, `సర్కారు వారి పాట`, `అంటే.. సుందరానికీ!`లో ఏ ఒక్కటీ సాలిడ్ హిట్ అనిపించుకోలేకపోయింది.
అలాగే, డీఎస్పీ సంగతికి వస్తే.. `రౌడీ బాయ్స్`, `గుడ్ లక్ సఖి`, `ఖిలాడి`, `ఆడవాళ్ళు మీకు జోహార్లు`, `ఎఫ్ 3` అంటూ ఈ సంవత్సరంలో ఇప్పటివరకు రిలీజైన చిత్రాల్లో సరైన హిటేదీ లేదు. మరి.. ఈ నలుగురికి `ది వారియర్` కమ్ బ్యాక్ ఫిల్మ్ గా నిలుస్తుందేమో చూడాలి. అదేవిధంగా, గత చిత్రం `రెడ్`తో సోసో హిట్ అందుకున్న రామ్ `ఇస్మార్ట్ శంకర్` స్థాయి ఫలితం అందుకుంటాడా? అన్నది కూడా ఆసక్తికరమే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



