ట్రైలర్ రివ్యూ : అభినేత్రి
on Sep 12, 2016

పదేళ్ల కెరీర్‌లో తొలిసారి నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమా చేస్తోంది తమన్నా. అదే.. అభినేత్రి. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభుదేవా, సోనూసూద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది వరకు విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై అంచనాల్ని పెంచాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా విడుదలైంది. ఇదో హారర్ కామెడీ సినిమా అని ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతోంది. హీరోయిన్ కావాలనుకొని ఆశపడే ఓ పల్లెటూరి అమ్మాయి ఒకరి చేతిలో మోసపోతుంది. మరి తనెలా ప్రతీకారం తీర్చుకొంది?? అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ కథ తిరగబోతోంది. సినిమా చుట్టూ తిరిగే కథ కాబట్టి ఆసక్తి రేకెత్తించే అంశాలు పుష్కలంగా ఉంటాయి. అవన్నీ.. ట్రైలర్‌లోనూ కనిపించాయి. మరీ ముఖ్యంగా తమన్నా గ్లామర్ ఈ సినిమాకి ప్రధానమైన ప్లస్ పాయింట్. తమన్నాలోనే దెయ్యం పూనిందా, లేదంటే తమన్నానే దయ్యమా? అనే సస్పెన్స్ కూడా మెయిన్‌టైన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుదేవా, తమన్నాలు వేసిన స్టెప్పులు ఈ సినిమాకి మేజర్ హైలెట్. అయితే టీజర్లో చూపించిన స్టెప్పులే రిపీట్ చేయడం వల్ల ఆ ఆసక్తి తగ్గింది. కొత్త స్టెప్పులు చూపిస్తే బాగుండేది. మొత్తానికి ఈ ట్రైలర్‌తో అభినేత్రిపై ఫోకస్ మరింత పెరిగే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



