రవితేజకు ఛాలెంజ్ విసిరిన గుత్తాజ్వాల, విష్ణు విశాల్!
on Feb 6, 2022

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్ లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల, సినీనటుడు విష్ణు విశాల్ దంపతులు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా విష్ణు విశాల్, గుత్తా జ్వాల మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం హీరో రవితేజ, డైరెక్టర్ మను ఆనంద్ కి విష్ణు విశాల్ గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.
అరణ్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విష్ణు విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఎఫ్‌ఐఆర్' ఫిబ్రవరి 11న తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదల కానుంది. రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



