Home

»

Latest News

2021 జ్ఞాప‌కాలుః  `బౌన్స్ బ్యాక్` కెప్టెన్స్!

Dec 4, 2021 11:36AM

2021 క్యాలెండ‌ర్ ఇయ‌ర్ కొంత‌మంది ద‌ర్శ‌కుల‌ను మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి తీసుకువ‌చ్చింది. ఆ కెప్టెన్స్ వివ‌రాల్లోకి వెళితే..

గోపీచంద్ మ‌లినేనిః- కెరీర్ ఆరంభంలో `డాన్ శీను`, `బ‌లుపు` వంటి విజ‌యాల‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని.. ఆపై వ‌చ్చిన `పండ‌గ చేస్కో`, `విన్న‌ర్` చిత్రాల‌తో ఆశించిన ఫ‌లితాల‌ను అందుకోలేక‌పోయారు. ఈ నేప‌థ్యంలో.. ఈ సంక్రాంతికి వ‌చ్చిన `క్రాక్` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి మ‌రీ మ‌ళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేశారు.

శ్రీ‌కాంత్ అడ్డాలః- ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన కొత్త‌ల్లో `కొత్త బంగారు లోకం`, `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న శ్రీ‌కాంత్ అడ్డాల‌.. అనంత‌రం `ముకుంద‌`, `బ్ర‌హ్మోత్స‌వం` రూపంలో రెండు వ‌రుస ప‌రాజ‌యాలు చూశారు. క‌ట్ చేస్తే.. ఈ ఏడాది జూలై 20న ఓటీటీలో స్ట్రీమ్ అయిన `నార‌ప్ప‌`తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేశారు.

భాస్క‌ర్ః- తొలి చిత్రం `బొమ్మ‌రిల్లు`తోనే మెమ‌ర‌బుల్ హిట్ అందుకున్న భాస్క‌ర్ ఆపై `ప‌రుగు`తో ఓకే అనిపించుకున్నా.. `ఆరెంజ్`, `ఒంగోలు గిత్త‌`తో బ్యాక్ టు బ్యాక్ డిజాస్ట‌ర్స్ చూశారు. ఈ క్ర‌మంలో.. చాన్నాళ్ళ త‌రువాత తెలుగునాట మెగాఫోన్ ప‌ట్టి తీసిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`తో మ‌ళ్ళీ విజ‌యం చూసి.. బౌన్స్ బ్యాక్ అయిన ద‌ర్శ‌కుల జాబితాలో చేరారు.

బోయ‌పాటి శ్రీ‌నుః- ఒక ద‌శ‌లో వ‌రుస ఘ‌న‌విజ‌యాల‌తో అల‌రించిన బోయ‌పాటి శ్రీ‌ను.. `జ‌య జాన‌కి రామ‌`, `విన‌య విధేయ రామ‌` చిత్రాల‌తో ఆశించిన ఫ‌లితాల‌ను అందుకోలేక‌పోయారు. క‌ట్ చేస్తే.. తాజాగా విడుద‌లైన `అఖండ‌`తో త‌న స్థాయి స‌క్సెస్ చూసి.. గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చారు.

అలాగే యువ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది కూడా `సీటీ మార్`తో చెప్పుకోద‌గ్గ విజ‌యం చూసి.. కాస్త ఊర‌ట పొందారు.

ఓవ‌రాల్ గా 2021 సంవ‌త్స‌రం ప‌రాజ‌యాల‌తో రేసులో వెనుక‌బ‌డ్డ ద‌ర్శ‌కుల‌కు.. బాగానే క‌లిసొచ్చింద‌నే చెప్పాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com