డైరెక్ట్ చేస్తోన్న తొలి సినిమాలో మోహన్‌లాల్ గుండు అవతారం!
on Jan 1, 2022

దశాబ్దాల తరబడి నటునిగా ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తూ వస్తోన్న మలయాళం మెగాస్టార్ మోహన్‌లాల్ 'బరోజ్' సినిమాతో దర్శకుడిగా తొలిసారి అవతారం ఎత్తారు. 2021 మార్చిలో ఆయన డైరెక్షన్ చేస్తోన్న ఫస్ట్ ఫిల్మ్ సెట్స్‌పైకి వచ్చింది. ఈ మూవీలో మెయిన్ లీడ్ చేస్తోన్న ఆయన, న్యూ ఇయర్ సందర్భంగా ఆ సినిమాలో ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
ఆ ఫస్ట్ లుక్‌లో మోహన్‌లాల్ పూర్తిగా షేవ్ చేసిన గుండు, గుబురు మీసాలు, గడ్డంతో కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. సింహాసనం లాంటి బంగారు ఆసనంపై కూర్చొని గంభీరంగా చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేసిన మోహన్‌లాల్, "ఇక్కడ మరో ఏడాది మన ముందు లేవాలని కోరుకుంటున్నాను. మీలో ప్రతి ఒక్కరికీ అన్ని విధాలుగా శుభాలు, శ్రేయస్సులు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సంవత్సరం మీ జీవితంలో అత్యంత విలువైన టైమ్ ఫ్రేమ్స్‌లో ఒకటిగా మారాలి." అని రాసుకొచ్చారు.
ఈ మూవీలో 'బరోజ్' అనే టైటిల్ రోల్‌ను ఆయన పోషిస్తున్నారు. వాస్కో డ గామాకు చెందిన నిధిని కాపాడే వ్యక్తిగా ఆయన కనిపించనున్నారు. 3డిలో చిత్రీకరిస్తోన్న ఈ మూవీలో యానిమేషన్, వీఎఫ్ఎక్స్ టెక్నాలజీని విరివిగా ఉపయోగించనున్నారు. ఇండియాలో తొలి 3డి మూవీ 'మై డియర్ కుట్టిచేతన్' సృష్టికర్త అయిన జిజో పున్నూస్ రాసిన కథ ఆధారంగా ఈ సినిమా తయారవుతోంది. స్పానిష్ నటులు పాజ్ వేగా, రాఫెల్ అమర్గో, ప్రముఖ మలయాళం నటుడు ప్రతాప్ పోతన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



