Home

»

Latest News

రూ. 50 కోట్ల క్ల‌బ్‌లో 'అఖండ‌'! బాల‌య్య కెరీర్ బెస్ట్‌!!

Dec 08, 2021

 

నంద‌మూరి బాల‌కృష్ణ డ్యూయ‌ల్ రోల్ చేసిన 'అఖండ' మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విజ‌య దుందుభి మోగిస్తోంది. ఆరో రోజు ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్ల ప‌రంగా రూ. 50 కోట్ల మైలురాయిని అధిగ‌మించింది. ఓవ‌రాల్‌గా ఈ సినిమా రూ. 51.82 కోట్ల షేర్ సాధించి, కెరీర్ బెస్ట్ ఫిగ‌ర్స్‌ను న‌మోదు చేసింది. ఈ క్ర‌మంలో మునుప‌టి హ‌య్యెస్ట్ గ్రాస‌ర్ 'గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి' (2017) సాధించిన రూ. 50.25 కోట్ల షేర్‌ను దాటేసింది. ఇక 2021లో ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజైన సినిమాల్లో 'అఖండ' సెకండ్ ప్లేస్‌లో నిల‌వ‌డం గ‌మ‌నార్హం. ప‌వ‌న్ క‌ల్యాణ్ 'వ‌కీల్ సాబ్' వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 86.36 కోట్ల షేర్‌తో అగ్ర‌స్థానంలో ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే, ఆరో రోజు 'అఖండ' రూ. 2.53 కోట్ల షేర్‌ను సాధించింది. ఓవ‌రాల్‌గా ఏపీ-తెలంగాణ‌లో ఆరు రోజుల క‌లెక్ష‌న్ రూ. 43.67 కోట్ల షేర్‌ను అందుకుంది. బాల‌య్య సినిమాలలో ఇది హ‌య్యెస్ట్ షేర్‌. బాల‌య్య‌-బోయ‌పాటి కాంబినేష‌న్‌కు తిరుగుండ‌ద‌నే అభిప్రాయాన్ని 'అఖండ' అదిరిపోయే రేంజ్‌లో నిజం చేసింది. మునుప‌టి సినిమాలు 'సింహా', 'లెజెండ్' సినిమాల‌ను మించిన వ‌సూళ్ల‌తో నిర్మాత‌లు, బ‌య్య‌ర్ల‌ను ఆనంద డోలిక‌ల్లో ముంచెత్తుతోంది 'అఖండ‌'. 

2021లో రూ. 50 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించిన సినిమాలు మూడే మూడు. మూడో సినిమా పంజా వైష్ణ‌వ్‌తేజ్ హీరోగా ప‌రిచ‌య‌మైన 'ఉప్పెన‌'. ఆ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 51.52 కోట్ల షేర్ రాబ‌ట్టింది. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com