తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల షేర్ దాటిన 'అఖండ' ప్రభంజనం!
on Dec 7, 2021
'అఖండ'గా నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తోన్న ప్రభంజనం అలా ఇలా లేదు అన్నట్లుగా కొనసాగుతోంది. సోమవారం ఐదో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో రూ. 3.58 కోట్ల షేర్‌ను సాధించింది. దీంతో ఐదు రోజులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 'అఖండ' రూ. 41.14 షేర్ సాధించి ట్రేడ్ పండితులను ఆశ్చర్యంలో ముంచేసింది. తెలంగాణలో రూ. 1.31 కోట్లు, ఆంధ్రాలో రూ. 1.36 కోట్ల షేర్‌ను సాధించిన 'అఖండ'కు రాయలసీమ ప్రాంతంలో రూ. 0.91 కోట్ల షేర్ లభించింది.
బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ మూవీ తొలి రోజు రూ. 15.39 కోట్ల షేర్‌తో బాలయ్య మూవీస్‌లోనే కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్‌ను సాధించిన విషయం తెలిసిందే. రెండో రోజు రూ. 6.83 కోట్లు, మూడో రోజు రూ. 7.03 కోట్లు, నాలుగో రోజు రూ. 8.31 కోట్ల షేర్ సాధించిన 'అఖండ'.. బయ్యర్ల ముఖాలను కళకళలాడిస్తోంది. తెలుగు చిత్రసీమ సైతం అఖండ కలెక్షన్లతో ఆనంద డోలికల్లో తేలియాడుతోంది. టాలీవుడ్‌కు ఈ వసూళ్లు పెద్ద బూస్ట్‌నిచ్చాయనే అభిప్రాయం ఇండస్ట్రీ వ్యాప్తంగా వినిపిస్తోంది.
బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో రూపొందిన 'సింహా', 'లెజెండ్' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఒకదాన్ని మించి మరొకటి బారీ వసూళ్లను సాధించి బ్లాక్‌బస్టర్స్ అనిపించుకున్నాయి. ఇప్పుడు 'అఖండ' వారి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ను నమోదు చేయడమే కాకుండా, వాటిని మించిన వసూళ్లతో దూసుకుపోతోంది. కమర్షియల్‌గా బాలయ్య కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది.
2021లో మొదటి ఐదు రోజుల కలెక్షన్ల విషయంలో 'అఖండ' రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో రూ. 65.86 కోట్లతో పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' ఉంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
