సామ్.. బ్యాక్ టు బ్యాక్ పాన్ - ఇండియా ప్రాజెక్ట్స్!
on Dec 7, 2021
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న చెన్నై పొన్ను సమంత.. `ద ఫ్యామిలీ మ్యాన్ - 2` వెబ్ సిరీస్ తో హిందీ ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేసింది. త్వరలో ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ ఓ గ్లోబల్ మూవీ కూడా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది సమంత బ్యాక్ టు బ్యాక్ పాన్ - ఇండియా ప్రాజెక్ట్స్ తో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
సమంతకు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ రావడానికి కారణం.. రానా!
ఆ వివరాల్లోకి వెళితే.. ఈ నెల 17న పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ కానున్న అల్లు అర్జున్ `పుష్ప` కోసం ఓ ఐటమ్ సాంగ్ లో తన చిందులతో కనువిందు చేయనున్న సామ్.. వచ్చే ఏడాది రెండు ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో పాన్ - ఇండియా సందడి చేయనుంది. ఆ చిత్రాలే.. `శాకుంతలం`, `యశోద`. నిన్నటి తరం అగ్ర దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన `శాకుంతలం` మైథలాజికల్ మూవీగా రూపొంది.. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రాబోతోంది. ఇక దర్శకులు హరి - హరీశ్ తెరకెక్కిస్తున్న `యశోద` కూడా వచ్చే సంవత్సరం పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సందడి చేయనుంది.
'అఖండ' కలెక్షన్లను తట్టుకోలేక దిగాలుపడ్డ వ్యతిరేక వర్గం!
మరి.. ఈ బ్యాక్ టు బ్యాక్ పాన్ - ఇండియా ప్రాజెక్ట్స్ తో సామ్ ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తుందో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
