దానికి భయపడని ఒకే ఒక్క సూపర్ స్టార్ 'అల్లు అర్జున్'!
on Dec 7, 2021
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 'పుష్ప ది రైజ్' డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లో అల్లు అర్జున్ చెప్పే డైలాగ్స్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ కానీ అమితంగా ఆకట్టుకుంటున్నాయి.. ట్రైలర్ తో 'పుష్ప'పై అంచనాలు ఓ రేంజ్‌కు వెళ్లిపోయాయి. తన టేకింగ్‌తో సుకుమార్ 'పుష్ప'ను ఒక అసాధారణ చిత్రంగా మలిచాడనే నమ్మకాన్ని ఈ ట్రైలర్ కలిగిస్తోంది.
పుష్ప ట్రైలర్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇక సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుష్ప ట్రైలర్ పై తనదైన శైలిలో స్పందించారు. "రియలిస్టిక్ క్యారెక్టర్ లో నటించడానికి భయపడని సూపర్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవి, రజినీకాంత్ తదితరులు ఇలాంటి పాత్రలు చేయగలరా?" అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. అంతేకాదు "పుష్ప అంటే ప్లవర్ కాదు.. ఫైర్" అంటూ ట్రైలర్ లో బన్నీ చెప్పిన డైలాగ్ ని కూడా ఆర్జీవీ ట్వీట్ లో జతచేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. గతంలోనూ బన్నీని రియల్ మెగాస్టార్ అంటూ ఆర్జీవీ ప్రశంసించడం విశేషం. ఇక ఈ ట్వీట్ లో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి మిగతా స్టార్ల పేర్లను ఆర్జీవీ ప్రస్తావించలేదు. దీంతో ఈ ట్వీట్ వెనుక ఉన్న ఆర్జీవీ అసలు ఉద్దేశం ఏంటన్న దానిపై చర్చలు మొదలయ్యాయి.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న పుష్పలో బన్నీకి జోడీగా రష్మిక నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
