బాలకృష్ణ ఫస్ట్ హీరోయిన్ జయమాలిని
on Dec 18, 2022

జయమాలిని ఒకప్పటి స్టార్ డాన్సర్. అప్పట్లో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన నటి. జయమాలిని పేరు వింటే చాలు మంచంలో ఉన్న ముసలివాడైనా లేచి కూర్చుంటాడు. సినీ ఇండస్ట్రీలో ఈమె డ్యాన్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉండేవారు. అలాంటి జయమాలిని ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పారు.
"నందమూరి రామారావు గారిని మేమంతా 'పెద్దాయన' అని పిలుస్తాం. రామారావు గారి ఇంటికి దగ్గరలోనే మా ఇల్లు కూడా ఉండేది. నిజంగా వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉండడం మా భాగ్యం. అలా ఆయన గాలి కూడా మా మీదకు వీచి ఉంటుంది. ఎవరైనా వస్తే రామారావు గారిని చూడకుండా వెళ్లేవారు కాదు. ఆయన్ని చూడడం అంటే సాక్షాత్తు ఆ తిరుపతి వెంకన్న స్వామినే చూసినట్టుగా భావించేవారు. ఐతే నేను ఆయనతో కలిసి నటించేవరకు నాకు ఆయన గొప్పతనం తెలియలేదు. అప్పటివరకు విన్నాను అంతే కానీ ఆయనతో కలిసి నటించాక అర్ధమయ్యింది. అలా పది సినిమాల్లో నటించాను. 'మగాడు' సినిమాలో ఒక షాట్ లో ఆయన దగ్గరకు వెళ్లి నమస్కారం చేసుకున్నాను. ఆయన కూడా నమస్కారం చేశారు. ఐతే 'మగాడు' మూవీకి ముందు 'అన్నదమ్ముల అనుబంధం' మూవీలో బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా చేసాను. బాలయ్య బాబు హీరోగా అదే ఫస్ట్ మూవీ. నేనే ఆయన ఫస్ట్ హీరోయిన్. బాలకృష్ణ చాలా అందగాడు. ఒక సీన్ లో నేను ఆయన చేయి పట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు నాకు చాలా భయమేసింది. అప్పుడు 'పెద్దాయన' వచ్చి నీ హీరోనే కదా చెయ్యి పట్టుకో.. హ్యాపీగా ఉండు అనేసరికి నాకు ధైర్యం వచ్చింది. బాలయ్య బాబు చూపులోనే ఏదో పవర్ ఉంది. అలాగే ఈ మూవీ రిహార్సల్స్ కి సలీం మాస్టర్ ఇంటికి వెళ్ళేవాళ్ళం. బాలయ్య బాబు వాటర్ బాటిల్ , కూల్ డ్రింక్స్, కాఫీ అవన్నీ తెచ్చుకునేవారు. నాకు మా అమ్మ అన్ని తెచ్చేది. ఆయన అసలు మాట్లాడేవారు కాదు. నేను కూడా అంతే. ఎవరికి ఏ సీన్ ఇస్తారో అది చేసేసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు బాలయ్య బాబు పంచ్ డైలాగ్స్ బాగా వేస్తున్నారు." అని ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు జయమాలిని.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



