అదా శర్మకు పెళ్లా? ఆమె ఏమంటోంది?
on Oct 29, 2019

హిందీలో నవంబర్ 1న 'బైపాస్ రోడ్' అని ఒక సీఎంగా విడుదలవుతోంది. అందులో నితిన్ 'హార్ట్ ఎటాక్' ఫేమ్ అదా శర్మ హీరోయిన్. ప్రభాస్ 'సాహో'లో అండర్‌కవర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిన నీల్ నితిన్ ముఖేష్ హీరో. 'బైపాస్ రోడ్'లో నటించేటప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారని ముంబై మీడియాలో కొందరు రాశారు. సాధారణంగా హిందీ సినిమాలకు ప్రమోషన్ కోసం హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్ ఉందని వార్తలు పుట్టిస్తారు. స్టార్స్ కూడా వాటిని ఎంకరేజ్ చేస్తుంటారు. కానీ, అదా శర్మ మాత్రం పెళ్లి వార్తపై సెటైర్ వేసింది. "జర్నలిజంలో అద్భుతమైన వార్త. ఎక్సలెంట్ రీసెర్చ్ చేశారు. పులిట్జర్ (అత్యున్నత జర్నలిజానికి అమెరికాలో ఇచ్చే బహుమానం) అవార్డు ఇవ్వొచ్చు" అని అదా శర్మ ట్వీట్ చేసింది. దీంతో పాటు హిందీలో అదా శర్మ చేసిన మరో సినిమా 'కమాండో 3' కూడా నవంబర్లో విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



