పవన్ అభిమానులకు ఇది శుభవార్తే
on Oct 29, 2019

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ రాజకీయాల్లో నుండి మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంటున్న మాట వాస్తవం. అందులో మరో సందేహం లేదు. ఆయన కథలు వింటున్నారు. ఎటువంటి సినిమాతో రీఎంట్రీ ఇస్తే బావుంటుందని ఆలోచిస్తున్నారు. దర్శకులు త్రివిక్రమ్, హరీశ్ శంకర్, డాలీ, క్రిష్ వంటివారు పవన్‌ను కలుస్తున్నారు. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు బయటకొస్తున్నాయి. ఏదీ అఫీషియల్ కాదు. బట్, ఫర్ ఏ ఛేంజ్... మెగా ఫ్యామిలీ నుండి అఫీషియల్‌గా పవన్ రీఎంట్రీ నుండి ఒక మాట బయటకొచ్చింది. బాబాయ్ కథలు వింటున్నారని మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తెలిపాడు. అదే సమయంలో ఆయన ఏ సినిమా అంగీకరించలేదని స్పష్టం చేశారు. సో... పవన్ కథలు వింటున్నారనేది నిజం.
అభిమానులకు ఇది శుభవార్తే. రామ్‌చరణ్ నోటి మాట బయటకు రాగానే క్రిష్ టీమ్ అలర్ట్ అయింది. పవన్ కోసం క్రిష్ జానపద కథను సిద్ధం చేస్తున్నారనే లీకులు బయటకు ఇచ్చింది. అయితే... ఇటు క్రిష్‌కు లేదా అటు ‘పింక్’ రీమేక్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఆయన ఎప్పుడు ఏ సినిమాకు ఎస్ అంటారోనని దర్శక, నిర్మాతలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



