వర్మ 'మెగా' కెలుకుడు
on Oct 29, 2019

'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమా థియేటర్లలో ఎన్ని రోజులు ఆడుతుందో తెలియదు కానీ... ఈ సినిమా పేరుతో రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో చేసే హడావిడి మాత్రం ఒక రేంజ్‌లో ఉంది. మెగా అభిమానులకు వర్మ తీవ్రంగా కోపం తెప్పిస్తున్నాడు. ఆయన కెలుకుడు మామూలుగా లేదు. 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' స్టిల్స్ తెగ విడుదల చేస్తున్నాడు. అందులో పవన్ కల్యాణ్ పాత్రను చూపించిన తీరుపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో వర్మ మరింత రెచ్చిపోయాడు.
"'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' తరవాత నేను తీయబోయే సినిమా టైటిల్ 'మెగా ఫ్యామిలీ'. మంగళవారం ఉదయం 9.36 గంటలకు డీటెయిల్స్ చెప్తా" అని సోమవారం రాత్రి ఒక ట్వీట్ చేశాడు వర్మ. ఆయనపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అయితే... యాంటీ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. దాంతో వర్మ ఏం చెబుతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. "'మెగా ఫ్యామిలీ' అనేది 39మంది పిల్లలు ఉన్న ఒక వ్యక్తి కథ. పిల్లలు ఎక్కువమంది ఉన్నారు కనుక, నాకు చిల్డ్రన్ ఫిల్మ్స్ తీయడంలో పట్టు లేదు కనుక, ఈ సినిమా తీయకూడదని నిర్ణయించుకున్నాను" అని మంగళవారం ఉదయం వర్మ ట్వీట్ చేశారు. పూర్తిగా పబ్లిసిటీ కోసం వర్మ వేసిన ఎత్తుగడ 'మెగా ఫ్యామిలీ'. మెగా అభిమానులకు మాత్రం మంట పుట్టించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



