స్టార్ హీరోలను 10 ఏళ్ల పాటు అటూ ఇటూ తిప్పనున్న సుక్కు!
on Dec 31, 2022

దర్శకులందరిలో మోస్ట్ జీనియస్ టాలెంటెడ్ దర్శకుడు ఎవరంటే సుకుమార్ పేరునే చెప్పాలి. ఆయన చిత్రాలు మొదట్లో ఎవరికి అర్థమయ్యేవి కావు. తన మొదటి చిత్రం ఆర్యతో అటు బన్నీకి పెద్ద హిట్‌ని ఇవ్వడమే కాకుండా తన మొదటి చిత్రంతోనే భారీ హిట్టును సొంతం చేసుకున్న ఈ జీనియస్. ఆ తర్వాత జగడం వంటి డిజాస్టర్ ఇచ్చారు. ఆ తర్వాత ఆర్య 2 కూడా పెద్దగా ఆడకుండా నిరాశపరిచింది. ఇదే సమయంలో 100% లవ్ అంటూ నాగచైతన్యతో పెద్ద హిట్టును కొట్టారు. ఆ తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే సినిమా తీశారు.
ఈ చిత్రం సామాన్య పరీక్షకులకి ఒక్క పట్టానా అర్థం కాదు. అదే మన లెక్కల మాస్టారు గారి ప్రతిభ. ఆయన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. మనం మాత్రం ఇక్కడే ఉంటాం. అందుకే ఆయన తీసిన వన్ నేనొక్కడినే తో పాటు ఎన్టీఆర్ హీరోగా తీసిన నాన్నకు ప్రేమతో చిత్రం కూడా సాధించాల్సిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. సినిమాలకైతే అద్భుతం అనే టాక్ వచ్చింది. కానీ ఆయన సినిమాలు మన తెలుగు రాష్ట్రాలలో ఆడలేదు. ఇక్కడ కేవలం క్లాస్ ఆడియన్స్ను మెప్పించిన ఈ సినిమాలు ఓవర్సీస్ లో మాత్రం తమ తడాఖా చూపించాయి.
ఇక ఆయన పంథాను మార్చిన లెక్కల మాస్టారు రంగస్థలం చిత్రంతో తనలోని మాస్ యాంగిల్ ను బయటికి తీసుకుని వచ్చారు. చిట్టి బాబుగా రామ్ చరణ్ ను చెవిటి వానిగా చూపిస్తూ ఆయన తీసిన రంగస్థలం రామ్ చరణ్ కెరీర్ లోనే కాదు సుకుమార్ కెరీర్ లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం. ఇలాంటి చిత్రాన్ని సుకుమార్ నుంచి ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ ఆయన నేల టికెట్ వాళ్లకు కూడా అర్థమయ్యేలా ఈ చిత్రాన్ని అత్యద్బుతంగా మాస్ ఎలిమెంట్స్ మిస్ కాకుండానే రియలిస్టిక్ గా తీసి ఔరా అనిపించారు. ఆ తర్వాత పుష్ప- ది రైజ్‌ను స్టైలిష్ స్టార్ బన్నీతో ఆర్య, ఆర్య 2 తర్వాత తీశారు. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లోనే కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో ఓ ఊపు ఊపేసింది. పాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయిన తర్వాత ఆయనకు బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి. కానీ ఆయనకు అక్కడకు వెళ్లడం ఇష్టం లేదు. రాజమౌళి ఎంతో ఇష్టపడే దర్శకుడైన సుకుమార్ రాజమౌళి తరహాలోనే ఇక్కడే సినిమా తీసి పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించాలని గోల్ పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. దాంతో ఆయనకు అక్కడికి వెళ్లే ఆసక్తి లేదు. వాళ్ళని ఇక్కడికి రప్పించేలా తన సత్తా చాటుతున్నారు. ఇక ఆయన దాదాపు పదేళ్లకు సరిపడ్డ ప్లానింగ్‌లో ముందుకు సాగుతున్నారు. 10 ఏళ్లకు సరిపడా కథలు, స్టార్ హీరోలు ఆయనకు రెడీగా ఉన్నారు. దీంతో పదేళ్ల పక్క ప్రణాళికతో ఆయన ముందుకు వెళ్తున్నారు.
పుష్ప2 షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇది పూర్తి చేసి విడుదల చేయడానికి కనీసం రెండేళ్లయినా పడుతుంది. పాన్ వరల్ఢ్ రేంజ్ లో అంతర్జాతీయ ప్రాజెక్టు కాబట్టి అంత సమయం పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికే స్క్రిప్ట్ కోసం ఎన్నో నెలలు కేటాయించిన సుకుమార్ మేకింగ్ పరంగా అంతకుమించి జక్కన్న మించి శిల్పాన్ని చెక్కే లా పుష్ప2ని చెక్కుతారని అంటున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ తో ఓ చిత్రం చేయనున్నారు. వీరి ప్రాజెక్టులో రానున్న మొదటి చిత్రం ఇదే అవుతుంది. దీనికోసం మరో రెండేళ్లు కేటాయిస్తారు. ఆ తర్వాత రంగస్థలం తర్వాత మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి లెక్కలు మాస్టారు సిద్ధంగా ఉన్నారు. సుక్కు వచ్చి సినిమా చేస్తే అంటే ఏ హీరో కాదనలేరు. అతడు ఎంతటి స్టార్ హీరో అయినా ఓకే చెప్పాల్సిందే. ఆయన కున్న క్రేజీ ప్రస్తుతం అలాంటిది. ఈ చిత్రం ఎప్పుడు ఉంటుంది అనేది పక్కనపెట్టి సుక్కు చెప్పిన ఆఫర్ ని ఓకే చేయడమే చరణ్ ముందున్న తక్షణ కర్తవ్యం అని భావించాలి. దాంతో చరణ్ కూడా వెంటనే ఓకే చేశారని సమాచారం.
ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు విడుదలవుతుంది? అనే విషయాలను పక్కన పెడితే వీటి తర్వాత మరోసారి అల్లు అర్జున్తో పుష్ప3 తీయాలనే ప్లానింగ్ లో ఆయన ఉన్నారట. బాలీవుడ్ ధూమ్ సిరీస్ తరహాలో ఆయన పుష్పాను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రాలు పూర్తయిన తర్వాత నాన్నకు ప్రేమతో చిత్రంతో క్లాస్ మూవీ ని తీసిన సుకుమార్ ఎన్టీఆర్ తో ఈసారి పక్కా మాస్ అండ్ రియలిస్టిక్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. ఇలా మొత్తంగా సుకుమార్ పాన్ ఇండియా రేంజ్‌ను రెట్టింపు చేసుకునేలా కనిపిస్తున్నారు. ఒకవైపు స్టార్ హీరోలను డైరెక్ట్ చేస్తూనే మరోవైపు తన ఆత్మసంతృప్తి కోసం తన మనసుకు నచ్చిన ఫీల్ గుడ్ చిత్రాలకు కథలు అందిస్తూ రచయితగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కుమారి 21ఎఫ్, 18 పేజెస్ చిత్రాలకు కథను అందించిన సుకుమార్ రాబోయే రోజుల్లో మరిన్ని కథలను అందించడంతోపాటు సుకుమార్ రైటింగ్స్ పేరుతో తన నిర్మాణ సంస్థలో పలువురు తన శిష్యులకు చిన్న చిత్రాల ద్వారా అవకాశాలు ఇచ్చి హిట్స్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి లెక్కల మాస్టారు గారి లెక్కల బాగోతం ప్లానింగ్ చూస్తే అదుర్స్ అనిపించక మానదు..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



