బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లాడిన అమలా పాల్
on Mar 20, 2020

కథానాయిక అమలా పాల్ ఈ రోజు కొత్త జీవితం ప్రారంభించారు. బాయ్‌ఫ్రెండ్ భవీందర్ సింగ్‌తో ఆమె ఏడడుగులు వేశారు. జీవితంలో కొత్త అడుగు వేయకుండా ఆమెను కరోనా అడ్డుకోలేకపోయింది. ‘కళ్యాణం వచ్చినా, కక్కు వచ్చినా... ఆగదు’ అనే సామెత ఇటువంటివి చూసే రాసి ఉంటారేమో. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ పెళ్లి చేసుకున్నారని టాక్.
అమలా పాల్, భవీందర్ సింగ్ కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారనే సంగతి తెలిసిందే. అమలా పాల్ డైరెక్టుగా ప్రేమ సంగతి చెప్పకున్నా, ఇన్‌స్టా పోస్టుల్లో భవీందర్ హింట్స్ ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. అమలా పాల్‌కి ఇది రెండో పెళ్లి. గతంలో తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్‌ని ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులకు మనస్ఫర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చాలా రోజులు ఒంటరిగా ఉన్నారు. మళ్లీ భవీందర్‌తో ప్రేమలో పడ్డారు. పెళ్లాడారు.
సినిమాల విషయానికి వస్తే... తెలుగులో రామ్‌చరణ్ సరసన ‘నాయక్’లో ఒక కథానాయికగా అమలా పాల్ నటించారు. నాగచైతన్యతో ‘బెజవాడ’, సిద్ధార్థ్‌తో ‘లవ్ ఫెయిల్యూర్’, అల్లు అర్జున్‌తో ‘ఇద్దరమ్మాయిలతో’, నానితో ‘జెండాపై కపిరాజు’ సినిమాల్లో నటించారు. గతేడాది తమిళ అనువాదం ‘ఆమె’లో నగ్నంగా నటించి సంచలనం సృష్టించారు. తెలుగులో చాలా రోజుల తర్వాత ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ చేశారు. త్వరలో అది విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



