బాలీవుడ్ సింగర్‌కి కరోనా... ప్రముఖుల్లో ఆందోళన
on Mar 20, 2020

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో తొలి కరోనా కేసు నమోదు అయింది. బాలీవుడ్ సింగర్ కణికా కపూర్‌కి కరోనా వచ్చింది. మెడికల్ టెస్ట్స్ చేయగా... ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇన్‌స్టాగ్రామ్‌లో స్వయంగా ఆవిడే ఈ విషయాన్ని చెప్పారు. దాంతో బాలీవుడ్ సెలబ్రిటీలు, కొందరు ప్రభుత్వ అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఇండియన్ ఫిల్మ్ అండ్ టీవీ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ పండిట్ అయితే కణికా కపూర్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. దీనంతటకీ కణికా కపూర్ బాధ్యతారాహిత్యమే కారణం.
కొన్ని రోజుల క్రితం కణికా కపూర్ లండన్ వెళ్లి వచ్చారు. లండన్‌లో లేదా ప్రయాణంలో ఆమెకు కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. పది రోజుల క్రితం ఎయిర్‌పోర్టులో థర్మల్ స్ర్కీనింగ్ చేసినప్పుడు కరోనా ఉన్నట్టు ఫలితాలేమీ రాలేదనీ, నాలుగు రోజుల నుండి కరోనా లక్షణాలు కనిపించాయనీ కణికా కపూర్ పేర్కొన్నారు. అయితే... విదేశీ ప్రయాణాలు చేసి వచ్చినవాళ్లు రెండు వారాల పాటు స్వీయ నిర్భందంలో ఉండాలని ప్రభుత్వాధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. కణికా కపూర్ అటువంటి సూచనలను పట్టించుకోకుండా గత వారం లక్నోలో ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో పార్టీకి అటెండ్ అయ్యారు. ఆ పార్టీకి సినిమా ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ అధికారులు, వీఐపీలు... సుమారు వందమంది వరకూ అటెండ్ అయ్యారట. దాంతో వారంతా తమ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఇతరుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టిన కణికా కపూర్‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



