పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న అభినయ!
on Jan 28, 2023
అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే నీరసపడిపోయేవారిని చాలా మందిని చూస్తుంటాం. చిన్న విషయాలకే కుంగిపోతుంటారు కొందరు. అలాంటివారందరికీ ఓ లివింగ్ ఎగ్జాంపుల్ నటి అభినయ. పుట్టుకతోనే చెవులు వినిపించకపోయినా, మాట్లాడలేకపోయినా, తనకున్న ఇష్టాన్ని వృత్తిగా మలచుకుని రాణిస్తున్నారు నటి అభినయ. నాడోడిగల్ సినిమా ద్వారా ఫేమ్ తెచ్చుకున్న నటి అభినయ. డిఫరెంట్లీ ఏబుల్డ్ అమ్మాయిగా సిల్వర్ స్క్రీన్ మీద తన సత్తా చాటుతున్నారు. అభినయ తమిళంలోనూ తెలుగులోనూ చాలా చిత్రాల్లో నటించి తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఓ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.
కుట్రంపురిందాల్ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ నచ్చి, ఈ సినిమాను చేస్తున్నట్టు తెలిపారు అభినయ. డిస్నీ అనే డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆదిక్ బాబు కథానాయకుడుగా నటిస్తున్నారు . బెంగళూరుకు చెందిన అర్చన ఇందులో నాయిక. అభినయ తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో వెంకటేష్ , మహేష్ కు చెల్లెలుగా నటించారు. శంభో శివ శంభో చిత్రంలో రవితేజకు చెల్లెలుగా నటించారు. ఇటీవల కాలంలో వచ్చిన సీతారామమ్ సినిమాలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వదినగా, మరదలిని అర్థం చేసుకునే పాత్రలో మెప్పించారు అభినయ.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
