చియాన్ విక్రమ్ తంగలాన్ అప్డేట్!
on Jan 28, 2023
చియాన్ విక్రమ్ నటిస్తున్న సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పార్వతి, మాళవిక మోహనన్, పశుపతి కీ రోల్స్‌లో నటిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న సినిమా ఇది. జ్ఞానవేల్ రాజా నిర్మాత. ఈ సినిమా షూటింగ్ చెన్నైలో మొదలైంది ఆ తర్వాత కర్ణాటకలోనూ కొంత భాగాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు మళ్లీ చెన్నైలో కీ పోర్షన్ షూట్ చేస్తున్నారు. మాళవిక మోహన్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. తంగలాన్ అప్డేట్ జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చారు.
ఆయన ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. `` తంగలాన్ ఆడియో చాలా అద్భుతంగా వస్తోంది. రెండు పాటలు రికార్డు చేశాం. ఇంటర్నేషనల్ ట్రైబల్ మిక్స్ ఆడియో ఇప్పటిదాకా నేను ఎప్పుడూ చేయలేదు. వింటుంటే నాకే కొత్తగా అనిపిస్తుంది. విన్న ప్రతి ఒక్కరికి తంగలాన్ పాటలు నచ్చుతాయి. ఫ్రెష్‌గా ఫీల్ అవుతారు. సౌండింగ్ చాలా కొత్తగా డిజైన్ చేశాం. మేము రికార్డ్ చేసిన పాటలు ఎప్పుడెప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటామా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను`` అని అన్నారు.
దీనిని బట్టి తంగలాన్ కథలో విక్రమ్ ట్రైబల్ హీరోగా కనిపించనున్నారని నిర్దారణకు వచ్చేశారు చియాన్ ఫ్యాన్స్. జీవీ ప్రకాష్ కుమార్ ఇచ్చిన హింట్ సినిమా మీద అంచనాలు పెంచుతుంది. ఆల్రెడీ ఆడియో బిజినెస్ కోట్లల్లో జరుగుతున్న ఈ తరుణంలో తంగలాన ఆడియో మీద ఇప్పటినుంచే హైట్ క్రియేట్ చేస్తున్నారు జీవి ప్రకాష్ కుమార్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
