శివ కార్తికేయన్ సినిమా కథలో మార్పులు జరుగుతున్నాయా?
on Jan 28, 2023
చూడగానే పక్కింటి అబ్బాయిగా కనిపించే హీరో శివకార్తికేయన్. ఆఫ్టర్ ప్యాండమిక్ థియేటర్లలో సినిమాలు ఆడటమే గగనమైనప్పుడు వరుసగా వంద కోట్ల చిత్రాలతో ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోయేలా చేశారు శివ కార్తికేయన్. శివకార్తికేయన్ హీరోగా ప్రస్తుతం తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం మావీరన్. ప్రిన్స్ సినిమా తర్వాత అశ్విన్ దర్శకత్వంలో మావీరన్‌లో నటిస్తున్నారు శివ కార్తికేయన్. అదితి శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మిష్కిన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు .
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది. ఈ నేపథ్యంలో శివ కార్తికేయన్ కి, ఈ చిత్ర దర్శకుడు అశ్విన్‌కి మధ్య అభిప్రాయాల బేధాలు వచ్చాయని, అందువల్ల ఇప్పటివరకు తెరకెక్కించిన సన్నివేశాలు అన్నిటినీ పక్కన పెట్టేసి కొత్తగా కథ రాస్తున్నారని ఓ వార్త కోలీవుడ్ లో వైరల్ అవుతుంది. కొత్త కథ రాసిన తర్వాత దాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తారన్నది వైరల్ న్యూస్. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంస్థ శాంతి టాకీస్ దీని గురించి మాట్లాడింది ``మావీరన్ షూటింగ్ ఆపి, కొత్త కథను సిద్ధం చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఈ సినిమా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ల మీద చర్యలు తీసుకుంటామని`` అన్నారు మేకర్స్.
శివ కార్తికేయన్ లేటెస్ట్ సినిమాకు సంబంధించి ఎలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపింది యూనిట్. మావీరన్ సినిమా షూటింగ్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని చాలా స్మూత్‌గా షూటింగ్ జరుగుతోందన్నది చిత్ర యూనిట్ నుంచి వస్తున్న సమాచారం. శివ కార్తికేయన్ కుంచె నుంచి జాలువారిన కార్టూన్లే పాత్రధారులుగా మారి అతని వెంటపడుతాయట. ఆ తర్వాత ఏం జరిగిందనే ఆసక్తికరమైన ప్లాట్‌తో తెరకెక్కుతోంది మావీరన్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
