ప్రభాస్ 21 కోట్లు అప్పు చేశాడా.. షాక్ లో ఫ్యాన్స్!
on Dec 26, 2022

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. జక్కన్న చెక్కిన బాహుబలి రెండు భాగాలతో ఆయన ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. డార్లింగ్, యంగ్ రెబెల్ స్టార్ అనే బిరుదులు పొందాడు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా కొత్త బిరుదు అందుకున్నాడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సినిమా హిట్ అయిన ఫ్లాఫ్ అయినా ఆయన పై అభిమానులకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రభాస్ నుండి ఎప్పుడెప్పుడు కొత్త సినిమా వస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి అభిమానులకు షాక్ ఇచ్చే న్యూస్ ఇప్పుడు ప్రస్తుతం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ వంటి పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన రెమ్యూనేషన్ కూడా చాలా భారీగా ఉంటుంది. ఇప్పటికే నాలుగు క్రేజీ ప్రాజెక్టులను ప్రకటించిన ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ హర్రర్ కామెడీతో రాబోతుందని సమాచారం. తాజాగా ఈ సినిమా సెట్ లోని ప్రభాస్ ఫోటో లీక్ అయింది. ఇందులో ప్రభాస్ కొత్త లుక్ లో దర్శనమిస్తున్నాడు. ఆ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అభిమానులందరూ వింటేజ్ ప్రభాస్ అంటూ కొనియాడుతున్నారు. ఈ సినిమాతో డార్లింగ్ అభిమానులకు డైరెక్టర్ మారుతి మంచి ట్రీట్ ఇవ్వనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే బాహుబలి 1 & 2 తర్వాత ప్రభాస్‌కు సరైన హిట్టు దక్కలేదు. సాహో, రాధే శ్యామ్ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. ఈ క్రమంలో ఎలాగైనా తర్వాతి సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టాలని అతని ఫ్యాన్స్ తో పాటు ఆయన కూడా కోరుకుంటున్నారు. ఇక తాజాగా డార్లింగ్ ప్రభాస్ గురించి ఓ క్రేజీ రూమర్ షికారు చేస్తోంది.
ప్రభాస్ తనకున్న హైదరాబాద్ ప్రాపర్టీ లోని ఒకదానిపై ఓ బ్యాంకులో సుమారు రూ.21 కోట్ల రుణం తీసుకున్నాడని సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఆ అమౌంట్ కు సంబంధించిన చెక్కు కూడా తాజాగా ప్రభాస్‌కి అందిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దీంతో ప్రభాస్ వంటి స్టార్ బ్యాంకులో రుణం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ నిజానికి ఇప్పుడు గ్లోబల్ స్టార్. ప్రభాస్ సినిమా ఒప్పుకుంటే ఆయనకు సుమారు 100 కోట్లకు పైగా రెమ్యూనేషన్ ఇచ్చే నిర్మాతలు ఉన్నారు. అలాంటి ప్రభాస్ బ్యాంకులో రుణం తీసుకోవడం ఏంటి? అని తలబాదుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే డబ్బు కోసం ప్రాపర్టీని బ్యాంకులో కుదువ పెట్టాల్సిన అవసరం ఏంటి? అని అనుమానాలు వస్తున్నాయి. కానీ ఆయన డబ్బులు అవసరమై ఆస్థిని కుదువ పెట్టలేదని కేవలం ఆ ప్రాపర్టీ కబ్జా కాకుండా కాపాడుకునేందుకు ప్రభాస్ ఇలా చేసి ఉండొచ్చని మరికొందరు చెప్పుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో వేచి చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



