'ఆచార్య'కి కాజల్ సెంటిమెంట్!
on Jan 19, 2022
`ఖైదీ నంబర్ 150` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత మెగాస్టార్ చిరంజీవితో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ జోడీకట్టిన సినిమా `ఆచార్య`. విజనరీ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన ఈ సోషల్ డ్రామా వేసవి కానుకగా ఏప్రిల్ 1న థియేటర్స్ లో సందడి చేయనుంది. దాదాపు మూడున్నరేళ్ళ తరువాత స్టార్ హీరో కాంబినేషన్ లో చేసిన సినిమా కావడంతో.. `ఆచార్య` ఫలితం కాజల్ కి కీలకంగా మారింది.
ఇదిలా ఉంటే.. ఏప్రిల్ మాసం కాజల్ అగర్వాల్ కి లక్కీ మంత్ అనే చెప్పాలి. ఎందుకంటే.. గతంలో ఈ నెలలో కాజల్ నాయికగా నాలుగు తెలుగు చిత్రాలు రిలీజ్ కాగా.. వాటిలో మూడు సినిమాలు మంచి విజయం సాధించాయి. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. అవన్నీ కూడా స్టార్ హీరోల కాంబో మూవీస్ నే. 2010 ఏప్రిల్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా నటించిన `డార్లింగ్` రిలీజ్ కాగా.. 2011 ఏప్రిల్ లో సేమ్ ప్రభాస్ కి జంటగా యాక్ట్ చేసిన `మిస్టర్ పర్ ఫెక్ట్` విడుదలైంది. ఈ రెండు సినిమాలు కూడా విజయపథంలో పయనించాయి.
Also Read: డీఎస్పీ, తమన్, అనూప్.. ఆరేళ్ళ క్రితం అలా, ఇప్పుడిలా..!
ఇక 2013 ఏప్రిల్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ఆడిపాడిన `బాద్ షా` తెరపైకి రాగా.. అది కూడా హిట్ చిత్రాల లిస్ట్ లో చేరింది. అలాగే 2016 ఏప్రిల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జట్టుకట్టిన `సర్దార్ గబ్బర్ సింగ్` విడుదల కాగా.. అది మాత్రం నిరాశపరిచింది. మొత్తంగా.. ఏప్రిల్ నెలలో కాజల్ అగర్వాల్ కి సక్సెస్ రేట్ బాగుందనే చెప్పాలి. మరి.. కాజల్ ఏప్రిల్ సెంటిమెంట్ ఫలించి `ఆచార్య` కూడా తనకి ఓ మెమరబుల్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
