శ్రుతి.. ఈ సారి సెకండాఫ్ టార్గెట్!
on Jan 19, 2022
.webp)
ఒక దశలో వరుస విజయాలతో టాక్ ఆఫ్ టాలీవుడ్ అయింది చెన్నై పొన్ను శ్రుతి హాసన్. మధ్యలో కాస్త స్పీడ్ తగ్గించినా.. గత ఏడాది మరోసారి తన హవా చాటుకుందీ టాలెంటెడ్ యాక్ట్రస్. మాస్ మహారాజా రవితేజకి జంటగా నటించిన `క్రాక్`, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా సందడి చేసిన `వకీల్ సాబ్`తో తన ఖాతాలో రెండు సాలిడ్ హిట్స్ ని క్రెడిట్ చేసుకుంది శ్రుతి హాసన్. ఈ రెండు కూడా 2021 ఫస్టాఫ్ లోనే థియేటర్స్ లో ఎంటర్టైన్ చేశాయి.
Also Read: ఈ సమాజం రేపిస్టులని ప్రేమిస్తోంది
కట్ చేస్తే.. 2022లో అందుకు భిన్నంగా సెకండాఫ్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది శ్రుతి హాసన్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న `సలార్`లో హీరోయిన్ గా నటిస్తున్న శ్రుతి.. సదరు సినిమాతో 2022 ద్వితీయార్ధంలో పలకరించనుంది. ఇక తన లక్కీ కెప్టెన్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన ఆడిపాడనున్న `ఎన్.బి.కె. 107` కూడా ఈ ఏడాది సెకండాఫ్ లోనే వినోదాలు పంచనుందని సమాచారం. సో.. 2022 సెకండాఫ్ టార్గెట్ గా శ్రుతి హాసన్ నెక్స్ట్ వెంచర్స్ రాబోతున్నాయన్నమాట. మరి.. ఆయా చిత్రాలతో శ్రుతి ఎలాంటి ఫలితాలను స్కోర్ చేస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



