'ఆచార్య' ఉగాది పోస్టర్.. నీలాంబరి ఫస్ట్ లుక్!
on Apr 13, 2021
.jpg)
చిరంజీవి టైటిల్ రోల్ చేస్తుండగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న మూవీ 'ఆచార్య'. ఈ మూవీలో రామ్‌చరణ్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అతని క్యారెక్టర్ పేరు సిద్ధ. కథలో ఆయనకూ ఓ లవ్ స్టోరీ ఉంది. ఆయన ప్రియురాలి పేరు నీలాంబరి. ఆ పాత్రను పూజా హెగ్డే పోషిస్తోంది. ఆమె లుక్ ఎలా ఉంటుందనేది ఇంతదాకా బయటకు రాలేదు. ఇప్పుడు ఉగాది సందర్భంగా పూజా హెగ్డే అలియాస్ నీలాంబరి లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు.
పూజను చేతుల్తో వంచి తను పొదివి పట్టుకున్న పోస్టర్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన చరణ్, "Introducing #Siddha's Love #Neelambari ! Wishing you all a very Happy Ugadi. #Acharya" అని రాసుకొచ్చాడు. ఆ పోస్టర్‌లో చరణ్, పూజ.. ఇద్దరూ ఒకరి కళ్లల్లోకి ఒకరు ఆరాధనగా చూసుకుంటున్నారు. చూడగానే ఆ ఇద్దరితో జనం ప్రేమలో పడకుండా ఉండలేరన్నట్లుంది ఆ స్టిల్. ఆ ఇద్దరి కెమిస్ట్రీ అమేజింగ్ అనిపిస్తోంది. 'రంగస్థలం' చిత్రంలో "జిగేల్ రాణి" సాంగ్‌లో ఆ ఇద్దరూ తొలిసారి స్క్రీన్‌పై కలిసి కనిపించారు. అయితే జంటగా కనిపించడం ఇదే తొలిసారి.
.jpg)
'ఆచార్య' మూవీలో చిరంజీవి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. 'ఖైదీ నంబర్ 150' తర్వాత ఆ ఇద్దరూ కలిసి నటిస్తోన్న మూవీ ఇది. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తయింది. మొదట మే 13న ఈ సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకు రావాలనుకున్నారు కానీ, కొవిడ్-19 కేసులు రోజురోజుకూ తీవ్రతరం అవుతుండటంతో, రిలీజ్ డేట్‌ను పోస్ట్‌పోన్ చేయనున్నట్లు తెలుస్తోంది.
మణిశర్మ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాకు ఎస్. తిరునావుక్కరసు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై కొణిదెల సురేఖ సమర్పిస్తోన్న ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



