పొంగల్ స్పెషల్ గా `ఆచార్య` నెక్స్ట్ సింగిల్!
on Jan 5, 2022

మెగాస్టార్ చిరంజీవికి అచ్చొచ్చిన సంగీత దర్శకుల్లో మెలోడీబ్రహ్మ మణిశర్మ ఒకరు. `బావగారూ బాగున్నారా` (1998) నుంచి `స్టాలిన్` (2006) వరకు వీరి కాంబోలో వచ్చిన పలు చిత్రాలు విజయపథంలో పయనించాయి. కట్ చేస్తే.. 15 ఏళ్ళ అనంతరం వీరి కలయికలో మరో సినిమా వస్తోంది. అదే.. `ఆచార్య`. అంచనాలకు తగ్గట్టే ఇప్పటివరకు విడుదలైన `ఆచార్య`లోని పాటలన్నీ కూడా మెగాభిమానులను రంజింపజేశాయి.
ఫస్ట్ సింగిల్ గా రిలీజైన ``లాహే లాహే`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. సెకండ్ సింగిల్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డేపై చిత్రీకరించిన ``నీలాంబరి`` కూడా సంగీత ప్రియులను ఆకట్టుకుంది. అలాగే, రీసెంట్ గా యూట్యూబ్ ముంగిట నిలిచిన మూడో సింగిల్ ``శానా కష్టం` కూడా పార్టీ సాంగ్ గా ఎంటర్టైన్ చేస్తోంది. ఈ మూడు పాటలు కూడా మూడు విభిన్న నేపథ్యాల్లో తెరకెక్కినట్లు లిరికల్ వీడియోస్ ని బట్టి స్పష్టమవుతోంది. కాగా, `ఆచార్య` తాలూకు నెక్స్ట్ సింగిల్ ని పొంగల్ స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇది కూడా ఇన్ స్టంట్ హిట్ నంబర్ గా నిలిచే అవకాశముందని ఇన్ సైడ్ బజ్. త్వరలోనే ఈ పాటకి సంబంధించి స్పష్టత రానున్నది.
విజనరీ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన `ఆచార్య` ఫిబ్రవరి 4న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇందులో చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్ కనిపించనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



