అడివి శేష్.. ముచ్చటగా మూడు!
on Jan 5, 2022

కెరీర్ ఆరంభంలో కథానాయకుడిగా ఆశించిన విజయాలు అందుకోలేకపోయిన టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్.. గత కొంతకాలంగా వరుస విజయాలతో తెలుగునాట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. `క్షణం`(2016), `అమీ తుమీ`(2017), `గూఢచారి`(2018), `ఎవరు`(2019).. ఇలా వరుస సంవత్సరాల్లో విభిన్న పాత్రలతో కథానాయకుడిగా విజయాలు చూశాడు అడివి శేష్. అయితే, కరోనా ఎఫెక్ట్ తో 2020, 2021 క్యాలెండర్ ఇయర్స్ లో మాత్రం సిల్వర్ స్క్రీన్ పై శేష్ చిత్రాలు సందడి చేయలేదు.
ఈ నేపథ్యంలో.. 2022లో ముచ్చటగా మూడు సినిమాలతో పలకరించేందుకు సిద్ధమయ్యాడు శేష్. ఆ సినిమాలే.. `మేజర్`, `హిట్ 2`, `గూఢచారి` సీక్వెల్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన `మేజర్` ఫిబ్రవరి 11న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుండగా.. విశ్వక్ సేన్ `హిట్`కి సీక్వెల్ గా తయారవుతున్న `హిట్ 2` కూడా ఇదే ఏడాది రిలీజ్ కానుంది. అలాగే తన `గూఢచారి`కి కొనసాగింపు చిత్రంగా రాబోతున్న `గూఢచారి 2` కూడా ఇదే సంవత్సరం చివరలో వచ్చే అవకాశముందంటున్నారు.
మొత్తమ్మీద.. కథానాయకుడిగా ఒకే ఏడాదిలో ముచ్చటగా మూడు సినిమాలతో అడివి శేష్ ఎంటర్టైన్ చేయనుండడం వార్తల్లో నిలుస్తోంది. మరి.. ఈ చిత్రాలతో శేష్ ఎలాంటి ఫలితాలను, గుర్తింపుని పొందుతాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



