రామ్‌చరణ్‌కి ప్రమాదం.. మరోసారి ‘గేమ్ ఛేంజర్’ షెడ్యూల్ వాయిదా?
on Sep 25, 2023
‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంతో వరల్డ్‌వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రామ్‌చరణ్ చేస్తున్న నెక్స్‌ట్ మూవీ కూడా పాన్ ఇండియా మూవీ కావడంతో రామ్‌చరణ్ రేంజ్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో ఒక డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తున్న రామ్‌చరణ్ ఈ సినిమాతో మరో హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచీ అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. ఏదో ఒక కారణంతో సినిమా షూటింగ్ క్యాన్సిల్ అవుతూ వస్తోంది. ఇప్పుడు మరోసారి షూటింగ్ క్యాన్సిల్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం రామ్‌చరణ్ ఓ ప్రమాదానికి గురయ్యాడని, దీంతో అతని ముఖానికి గాయాలైనట్టు తెలుస్తోంది. తప్పనిసరిగా 15 రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. దీంతో షూటింగ్‌ను వాయిదా వేసినట్టు సమాచారం. వాస్తవానికి ఆదివారం నుంచి ‘గేమ్ ఛేంజర్’ తాజా షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. చరణ్‌కి గాయం అయిన కారణంగా మరోసారి షూటింగ్ వాయిదా పడిరది. మళ్ళీ ఈ షెడ్యూల్‌ను ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియాల్సి ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
