డ్రగ్స్ కేసులో నాగచైతన్య డైరెక్టర్ అరెస్ట్!
on Sep 25, 2023
డ్రగ్స్ వ్యవహారంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా ఉండడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఆమధ్య పెద్ద ఎత్తున డ్రగ్స్ గురించి సోదాలు చేయడం, కొంతమందిని విచారించడం వంటి ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత మళ్లీ డ్రగ్స్ కలకలం మొదలైంది. మాదాపూర్‌లో డ్రగ్స్ సరఫరాకి సంబంధించి పోలీసులకు అందిన సమాచారంతో పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే హీరో నవదీప్‌ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ఇప్పుడు కొత్తగా ఈ వ్యవహారంలో దర్శకుడు వాసువర్మకు కూడా సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తగిన ఆధారాలతో దర్శకుడు వాసువర్మను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అతనితోపాటు రచయిత మల్లేష్ పృథ్విని కూడా అరెస్ట్ చేసారు. రచయితగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా పలు బాధ్యతలు నిర్వహించిన వాసువర్మ దిల్‌రాజు కాంపౌండ్‌లోనే ఎక్కువ సినిమాలకు పనిచేశాడు. అందుకే దిల్‌రాజు అతనికి దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. యువసామ్రాట్ నాగచైతన్యను హీరోగా పరిచయం చేస్తూ దిల్‌రాజు నిర్మించిన ‘జోష్’ చిత్రం ద్వారా వాసువర్మ దర్శకుడిగా పరిచయమయ్యాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
