పవన్ కు స్పెషల్ షో వేసిన మాంత్రికుడు..!
on Jun 9, 2016

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల మధ్య ఎంత స్నేహం ఉందో ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. పర్సనల్ గానే కాక, ప్రొఫెషనల్ గా కూడా వీరిద్దరికీ మధ్య మంచి అనుబంధం ఉంది. ఒకరి సినిమాల గురించి మరొకరి సూచనలు సలహాలు తప్పనిసరిగా ఉంటాయి. రీసెంట్ గా సూపర్ హిట్టైన అ ఆ స్టోరీ కూడా త్రివిక్రమ్ పవన్ కు ముందే చెప్పాడు. ఆ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండటంతో ప్రస్తుతం త్రివిక్రమ్ ఫుల్ హ్యాపీస్. మరి హ్యాపీ మూమెంట్స్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలిగా. అందుకే రీసెంట్ గా వెకేషన్ నుంచి తిరిగొచ్చిన పవన్ కు అ ఆ స్పెషల్ షో వేసి చూపించాడట త్రివిక్రమ్. సినిమా చూస్తున్నంత సేపూ పవన్ ఫుల్ గా ఎంజాయ్ చేశాడట. ముఖ్యంగా రావు రమేష్ సీన్లకు పవన్ క్లాప్స్ కొట్టాడట. సినిమా అయిపోయిన తర్వాత కొన్ని సీన్లను మళ్లీ వేయించుకుని చూశాడట పవర్ స్టార్. త్రివిక్రమ్ డైలాగ్ రైటింగ్, రావు రమేష్ పెర్ఫామెన్స్ పవన్ ను అమితంగా ఆకట్టుకున్నాయని సమాచారం. స్నేహితుడు దర్శకత్వం చేసిన సినిమా, తమ్ముడి లాంటి నితిన్ హీరోగా చేసిన సినిమా, నచ్చకుండా ఎలా ఉంటుంది అంటారా..అయితే ఓకే..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



