జనతా గ్యారేజ్ డైలాగ్స్ లీకయ్యాయి..!
on Jun 9, 2016
నాన్నకు ప్రేమతో లాంటి సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా జనతా గ్యారేజ్. మిర్చి, శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లు తీసిన కొరటాల శివ డైరక్టర్ కావడంతో, ఈ మూవీ పై మొదటినుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే రోజుకో వార్త నెట్లో హల్ చల్ చేస్తోంది. తాజాగా జనతా గ్యారేజ్ డైలాగులంటూ కొన్ని డైలాగ్స్ నెట్లో ప్రచారంలోకి వచ్చాయి. అవి నిజంగానే సినిమాలోనివో కాదో తెలీదు గానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం వాటిని చూసి ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని ముందునుంచే యూనిట్ సభ్యులు చెబుతున్నారు. డైలాగ్స్ కూడా దానికి తగ్గట్టే ఉన్నాయి.
ఆకలేస్తే అన్నం పెట్టే అమ్మ, భయం వేస్తే తోడుగా ఉండే నాన్న లేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. మనిషికి అంతకు మించి నరకం ఉండదు.
లక్ష్మణరేఖ దాటిన తర్వాత రక్షణ గురించి ఆలోచించకుండా వెళ్ళిపోవడానికి నేను లక్ష్మణుడ్ని కాదురా.. లక్ష సముద్రాలైనా దాటి ఆపదలో ఉన్నవాళ్లను కాపాడటానికి దూకే వీరాంజనేయుణ్ని..
ఈ గ్యారెజీ లోకి వస్తే..ఒక్కొక్కడి బాడీలు కృష్ణా బ్యారేజీలో తేల్తాయి.
అన్న గ్యారేజీలో రిపేర్లే కాదు..అమ్మాయిల హార్ట్ ల రికవరీ కూడా చేస్తాడు.