నందినిరెడ్డి వల్ల సినిమాల్లోకి వచ్చాను...జాతీయ గీతం వింటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి
on Nov 8, 2022

స్నిగ్ద పేరు మాత్రమే అమ్మాయిది. గెటప్ అంతా అబ్బాయిలాగే ఉంటుంది. "అలా మొదలయ్యింది" మూవీలో స్నిగ్ద రోల్ కడుపుబ్బా నవ్వు తెప్పిస్తుంది. మేకప్ లేకుండా పెద్ద హడావిడి లేకుండా..సింపుల్ గా కనిపిస్తుంది. అలాంటి స్నిగ్ద తన మనసులో కొన్ని విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. "నాకు అసలు భయం అంటే తెలియదు. ఏడుపు అస్సలు రాదు. ఒక వేళ మూవీస్ లో ఏడుపు సీన్స్ చేయాలంటే పక్కకు వెళ్లి ఆ సీన్ కి కావాల్సిన మూడ్ తెచ్చుకుని నటిస్తాను. చావుకి మించిన పెద్ద బాధ మరొకటి లేదు. కానీ నాకు చిన్నప్పటినుంచి ఇప్పటివరకు కూడా మన జాతీయ గీతం విన్నప్పుడల్లా ఎందుకో తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తాయి. నాకు దేశ భక్తి చాలా ఎక్కువ. ఆ గీతం విన్నప్పుడల్లా గూస్ బంప్స్ వచ్చేస్తాయి నాకు.
ఇక నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఒక రోజు కల్యాణి మాలిక్ గారి దగ్గర ఒక సాంగ్ పాడాను. ఆ తర్వాత ఆఫీస్ కి పిలిచి యాక్టింగ్ ట్రై చేస్తావా అని అప్పుడు నందిరెడ్డి గారు అడిగారు. నేను ఓకే చెప్పేసాను. నాకు కెమెరా ఫియర్ కూడా లేదు. నాని, నిత్యాతో బయట కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాను కాబట్టి పెద్దగా నటించాల్సిన అవసరం రాలేదు. "అలా మొదలయ్యింది" మూవీ నుంచి ఇప్పటి వరకు రోజుకు 25 నుంచి 30 వేలు తీసుకుంటున్నాను. అంత ఇవ్వలేని వాళ్ళ దగ్గర ఒక 15 వరకు మాత్రమే తీసుకుంటాను. నాకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే మాత్రం నాకు కావాల్సినంత ఉంచుకుని మిగతాది ఛారిటీకి ఇచ్చేస్తాను" అని చెప్పింది స్నిగ్ద.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



